పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టినట్టే పట్టి మరల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిపోయింది అంతా నార్మల్ అవుతుంది అనుకునేలోపే ఇరాన్.. హోర్ముజ్‌లోని నౌకలపై దాడులు చేయడం..ఆ తర్వాత సీజ్‌ఫైర్ ముగిసిందని ట్రంప్ ప్రకటించడం, దాడులకు దిగడం..గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం అంతా ఓ కలలాగా జరిగిపోయింది.మిడిల్ ఈస్టులో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.ఫలితంగా బంగారం ధరలు సైతం సామాన్యుడికి అందనంత ఎత్తుకు పోతున్నాయి.
మరోసారి ఇన్వెస్టర్లు బంగారం మీద భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ఒక్కటే వారికి స్థిరమైన ఆస్తిలాగా కనిపిస్తున్నదని, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి డిమాండ్ అధికంగా ఉండి.. సప్లయ్ తగ్గిపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నట్టు సమాచారం. ఫలితంగా వినియోగదారులపై భారం పడుతోంది.
నిన్న,మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం పసిడి ధరలు అమాంతం పెరిగాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,44,330కు చేరుకోగా.. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.750 మేర ఎగబాకి రూ.1,32,300కు చేరుకుంది. గత రెండు రోజులుగా వెండి ధర రూ.2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.బులియన్ మార్కెట్‌లో బంగారం కొనే సమయంలో అదనంగా 3 శాతం జీఎస్టీ (GST)తో పాటు తయారీ కూలీ (మేకింగ్ చార్జీలు) వర్తిస్తాయని ట్రేడర్స్ చెప్పడం గమనార్హం.












