సినిమా

Dhanush-Venkey Atluri: ఈసారి పోలీస్ కథతో "సార్" కాంబో రిపీట్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Dhanush-Venkey Atluri: కొన్ని కాంబినేషన్ అంటే ముందుగా ఆసక్తి పెరిగేది ప్రేక్షకుల్లోనే. ఆ తర్వాత ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇలాంటి, కాంబినేషన్స్ కి అన్నీ రకాలుగా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అలాంటి, కాంబినేషనే తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరిది. వీరి కాంబోలో ఇంతకముందు సార్ అనే సినిమా వచ్చింది. సామాజిక అంశానికి, కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి హిట్ కొట్టారు.

ధనుష్ కెరీర్ లో సార్ సినిమా ఒక మైల్ స్టోన్ మూవీ. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. అయితే, మళ్ళీ ఈ కాంబోలో సినిమా ఉండబోతుందని దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించారు. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళ స్టార్ హీరో సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మమిత బైజు సూర్య సరసన హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. వెంకీ మేకింగ్ అండ్ కంటెంట్ పై నమ్మకం ఉండే సూర్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత కొంతకాలంగా సూర్యకి తమిళంలో హిట్ దక్కలేదు. అందుకే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఇక, ఈ సినిమా ప్రమోషన్స్ లోనే వెంకీ అట్లూరి తన నెక్స్ట్ సినిమా ధనుష్ తో ఉంటుందని..అది ఒక పోలీస్ కథ అని వెల్లడించాడు. అంతేకాదు, ప్రస్తుతం ఈ కథపై రీసెర్చ్ జరుగుతున్నట్టుగా తెలిపాడు. దీంతో, సార్ కాంబో రివీట్ అవుతుందని..వీరి కాంబోకి మరో హిట్ గ్యారెంటీ అని మాట్లాడుకుంటున్నారు. ధనుష్ కి ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ బాగా పెరిగారు. మార్కెట్ కూడా బావుంది. అందుకే, కుబేర..సార్ చిత్రాలు ఇక్కడ మంచి విజయాలను అందుకున్నాయి.

#Dhanush#Venkey Atluri#Sir#Sirya#Vishwanath&sons
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి