National

హృతిక్‌ లుక్‌.. కంగనాకు షాక్‌..! CJP నేత సెటైర్‌తో సోషల్ మీడియా షేక్!

రచన: Kashi6 నిమిషాల పఠనం

ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ‌మ్మ‌త్తైన చ‌ర్చ‌ నడుస్తోంది. "నిరుద్యోగి" అన్న కామెంట్‌కు... కోపంతో కాకుండా... హాస్యంతో సమాధానం చెప్పడం సౌరవ్‌కు ప్లస్ అయిందని కొందరు అంటున్నారు. మరికొందరు... హృతిక్ రోషన్ రిఫరెన్స్‌తో కంగనాను ట్రోల్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అని సౌర‌వ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు... కంగనా అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.

కంగ‌నా వ‌ర్సెస్ సౌర‌వ్ దాస్

కంగ‌నా కామెంట్స్‌కు.. మాట్లాడుకుందాం అంటూ కౌంట‌ర్లు

మ‌ధ్య‌లో హృతిక్ ఎపిసోడ్

వైర‌ల్ అవుతున్న సీజేపీ నేత డైలాగులు

ఒకప్పుడు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో మాటల యుద్ధం... ఇప్పుడు రాజకీయాల్లో CJPతో వార్! బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఎక్కడ మాట్లాడినా కాస్త ఘాటుగానే మాట్లాడతారు. ఎదురుగా ఉన్న‌దెవ‌రని చూడ‌రు. ముందు నుంచీ ఆమె తీరంతే. కానీ ఈసారి ఆమె వేసిన బౌన్సర్‌కు... CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఇచ్చిన రిప్లై మాత్రం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

కంగనా ఇటీవల CJPని క‌క్కొచ్చే పార్టీ అనేలా విమర్శించారు. అక్కడితో ఆగకుండా... పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌ను పనికిరాని వాడు... నిరుద్యోగి అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. గూగుల్‌లో కనిపించిన సమాచారం ఆధారంగా ఆయనపై కామెంట్లు చేశారు.

అయితే... కోపంతో కౌంటర్ ఇవ్వకుండా... వ్యంగ్యంతోనే బంతిని బౌండరీ దాటించారు సౌరవ్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... కంగనా నాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు.. అంటూ నవ్వుతూ మొద‌లుపెట్టారు. ఆ తర్వాత చెప్పిన ఒక్క లైన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌర‌వ్ ఏమ‌న్నారో తెలుసా..?

నా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసి... 'నువ్వు చిన్నప్పటి హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నావేమో... అందుకే కంగనా నీపై ఇంత ఫోకస్ పెడుతోంది' అన్నాడు. అది విని నేనూ షాక్ అయ్యాను. ఇదీ కంగ‌న చేసిన కామెంట్స్‌పై సౌర‌వ్ ఇచ్చిన సెటైరిక‌ల్ రిప్లై. ఈ ఒక్క కామెంట్‌తో... కంగనా-హృతిక్ వివాదాన్ని మరోసారి గుర్తు చేస్తూ... సౌరవ్ వేసిన సెటైర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ వివాదం ఇక్క‌డితో ఆగ‌లేదు. త‌న‌కు కంగనాపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు. గొడవలతో కాదు... మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అని సౌరవ్ చెప్పారు. ఇంతే కాదు... తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా కంగనాకు ప్రత్యేకంగా మెసేజ్ పెట్టారు. కంగనా... కాస్త ప్రశాంతంగా ఉండండి... మాట్లాడుకుందాం.. అంటూ రాసుకొచ్చారు. ఇది చదివిన నెటిజన్లు మాత్రం... "ఫైర్‌కు వాటర్ పోశాడా... లేక సెటైర్‌తోనే ఫైర్ పెంచాడా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సౌరవ్ మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. దేశంలో ఇప్పుడు చర్చలు తగ్గిపోయాయి. ఎవరి అభిప్రాయంతో ఏకీభవించకపోయినా... మాట్లాడుకునే సంస్కృతి ఉండాలి. పరస్పర గౌరవంతో డిబేట్ చేయాలని పిలుపునిచ్చారు. నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్‌గా ఫోన్ చేయొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కంగ‌నాను మ‌రింత వేడెక్కించారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ‌మ్మ‌త్తైన చ‌ర్చ‌ నడుస్తోంది. "నిరుద్యోగి" అన్న కామెంట్‌కు... కోపంతో కాకుండా... హాస్యంతో సమాధానం చెప్పడం సౌరవ్‌కు ప్లస్ అయిందని కొందరు అంటున్నారు. మరికొందరు... హృతిక్ రోషన్ రిఫరెన్స్‌తో కంగనాను ట్రోల్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అని సౌర‌వ్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు... కంగనా అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. వ్యక్తిగత విషయాలను మళ్లీ లాగడం అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి... రాజకీయ విమర్శగా మొదలైన ఈ వ్యవహారం... ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్ల యుద్ధంగా మారింది. కంగనా ఘాటు వ్యాఖ్యలకు... సౌరవ్ దాస్ నవ్విస్తూ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక దీనిపై కంగనా మళ్లీ స్పందిస్తారా... లేక ఈ ఎపిసోడ్‌కు ఇక్కడితో ముగింపు పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

#Kangana Ranaut#Saurav Das#CJP#Hrithik Roshan#Kangana vs Saurav#Viral Interview#Political Satire#Social Media Viral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి