వైరల్ న్యూస్

Viral : కొత్తగా పెళ్లి.. షేవింగ్ చేసుకుంటూ దొరికిపోయిన వధువు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం ఆలస్యం కావడంతో, పరిచయస్తుల ద్వారా రాజ్‌గఢ్ జిల్లా పచోర్‌కు చెందిన కుటుంబంతో సంబంధం కుదిరింది.జూన్ 29న స్థానిక ఆలయంలో ఆ యువకుడికి ఘనంగా వివాహం జరిగింది.

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వింతలు,విశేషాలు, ప్రమాదాలు, అప్డేట్స్ వెనువెంటనే తెలిసిపోతున్నాయి.అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు నెటిజన్లు. అయితే, ఇదే సోషల్ మీడియా కొన్ని వైరల్ వార్తలను కూడా మోసుకొస్తున్నది. తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.కొత్తగా పెళ్లయిన యువకుడికి వధువు జీవితంలో కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చినట్టు దీని సారాంశం.

ఇక అసలు వియషానికొస్తే.. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం ఆలస్యం కావడంతో, పరిచయస్తుల ద్వారా రాజ్‌గఢ్ జిల్లా పచోర్‌కు చెందిన కుటుంబంతో సంబంధం కుదిరింది.జూన్ 29న స్థానిక ఆలయంలో ఆ యువకుడికి ఘనంగా వివాహం జరిగింది. అయితే, శోభనానికి ముందు రోజే.. వధువు తనకు నెలసరి వచ్చిందని చెప్పి, రెండు రోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది.

జరగాల్సిన కార్యం మాత్రం జరగలేదు. వరుడు మాత్రం ఏం చేయాలో అర్థంకాక సైలెంట్ అయిపోయాడు. మళ్లీ వస్తుంది కదా?అని తనను తాను సముదాయించుకున్నట్టు తెలిసింది.అయితే, 25 రోజుల తర్వాత తిరిగి వచ్చిన వధువు.. అత్తగారింట్లో షేవింగ్ చేసుకుంటూ దొరికిపోయింది.

దీంతో వధువు.. మహిళ కాదని ట్రాన్స్‌జెండర్ అని వరుడి కుటుంబ సభ్యులు గుర్తించారు.తాము పథకం ప్రకారం మోసపోయామని ఆరోపిస్తూ షాజాపూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు వధువు తండ్రిగా పేర్కొన్న వ్య‌క్తితో పాటు పెళ్లి బ్రోక‌ర్ల‌పై కేసు పోలీసులు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

https://x.com/greatandhranews/status/2082685700705771571?s=20

#bride caught shaving#madyapradesh#viral#news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి