National

Bypolls : దేశంలో 3 స్థానాలకు బై పోల్స్.. బీజేపీకి ఎదురు గాలి తప్పదా?

రచన: Kumar3 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూల్ విడుదల చేయగా..ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభం అవ్వగా.. ప్రశాంతంగా కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూల్ విడుదల చేయగా..ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభం అవ్వగా.. ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని దతియా, గుజరాత్‌లోని మంజల్పూర్, బీహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6:00 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. లైన్లలో ఉన్నవారికి సమయం ముగిసినా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంబంధిత రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీటీవీ ద్వారా నిఘాను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. పోలింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. నీట్ నిరసనల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగగుతుండటంతో ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయా?వ్యతిరేకంగా వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది.యువ ఓటర్లు ఈసారి బీజేపీని ఆదరిస్తారా? లేక షాకిస్తారా? అనేది తేలాల్సి ఉన్నది.కాగా,జెన్ జీ అధికార పార్టీకి వ్యతిరేకంగా మారితే కాంగ్రెస్ లేదా ఇతరపార్టీలకు బెనిఫిట్ కానుంది. ముఖ్యంగా బీహార్‌లోని బాంకీపూర్ నియోజయవర్గ ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

#bypolls#assembly segments#nationalwide#politics#bjp states
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి