సినిమా

Rishab Shetty: రెమ్యునరేషన్ సరిపోక టాలీవుడ్ మూవీ క్యాన్సిల్

రచన: Anshu4 నిమిషాల పఠనం

Rishab Shetty: మన హీరోలలో కొందరు రెమ్యునరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. పెద్ద పెద్ద హీరోలే సినిమా ఫలితం తేడా కొడితే సగం రెమ్యునరేషన్‌తో సరిపెట్టుకున్న వారున్నారు. ఇంకా, కొంతమంది తీసుకున్న రెమ్యునరేషన్ సగానికి పైగానే తిరిగి ఇచ్చేసిన వారూ ఉన్నారు. ఈ జాబితాలో, మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకూ చాలామంది ఉన్నారు.

ఇక, రవితేజ అయితే వరుసగా తన సినిమాలు ఫ్లాపవుతున్నాయని..సినిమా హిట్ అయితేనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అని ప్రస్తుతం చేస్తున్న ఇరుముడి సినిమా మేకర్స్ చెప్పినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాంటి, మన తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, సినిమాటోగ్రాఫర్స్ కూడా నిర్మాతకి భారం కాకూడదని..ఆయన ఇంకో సినిమా తీస్తే కొన్ని వందల కుటుంబాలు బాగుంటాయని ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు కూడా.

అయితే, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడని టాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. సితార నాగవంశీ నిర్మాణంలో రిషబ్ ఒక హిస్టారికల్ మూవీ చేయాల్సి ఉందట. అయితే, ఈ మధ్య సితార నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపై నాగవంశీకి నష్టాలను తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన, రిషబ్ తో చేసే సినిమాకి రెమ్యునరేషన్ తగ్గించినట్టుగా సమాచారం.

కానీ, ఆ ఫిగర్ రిషబ్ కి సంతృప్తి కలగకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు రిషబ్. దీనితో పాటుగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ లాంటి మరో భారీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. కాంతార 2 పనులు ఒకపక్క జరుగుతున్నాయి. ఇంత, బిజీగా ఉన్నాడు కాబట్టే రెమ్యునరేషన్ డీల్ కుదరక నాగవంశీకి నో చెప్పాడట. అయితే, దీనిపై ఇప్పటి వరకూ అటు నాగవంశీ గానీ, ఇటు రిషబ్ గానీ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.

#SuryadevaraNagaVamsi#SitharaEntertainments#RishabSetty#JaiHanuman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి