వైరల్ న్యూస్

Viral : ప్రాణాలు తీస్తున్న మోక్షమార్గం.. తగ్గేదేలే అంటున్న భక్తులు!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీకి చెందిన ఓ మహిళ మోక్షమార్గంలో ఇరుక్కుని బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడింది. లోపలే చిక్కుకుపోవడంతో బయటకు రాలేక నానా ఇబ్బందులు పడింది. ఎంతో ప్రయత్నించినా బయటకు రాలేక.. శ్వాస తీసుకోవడానికి మహిళ ఇబ్బందులు పడటంతో

కొందరు భక్తులు నమ్మకం పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా అని అదంతా మూఢనమ్మకమని వారి విశ్వాసాన్ని కొట్టిపారేయలేని కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.వందల ఏళ్లుగా దీనిని భక్తులు విశ్వసిస్తూ వస్తున్నారని ఆ ఆలయంలో పండితులు, భక్తులు చెబుతున్నారు. ఇదంతా దేనికి గురించి అనుకుంటున్నారా? అదే అరుణాచలంలోని ‘మోక్షమార్గం’... ఇందులో నుంచి భక్తులు వస్తుంటారు.అలా చేస్తే వారు మరణించాక మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకోసం వారు ఇరుకు సందులో నుంచి లోనికి వెళ్లి మరల బయటకు రావాల్సి ఉంటుంది.

తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో గల అరుణాచలం టెంపుల్ చాలా ఫేమస్. దేశవిదేశాల నుంచి ఈ ఆలయంలోని అరుణాచలేశ్వరుడు( శివలింగం) దర్శనం కోసం భక్తులు వస్తుంటారు. రెండు తెలుగురాష్ట్రాల నుంచి కూడా ఇటీవల కాలంలో భక్తులు పెద్దఎత్తున అరుణాచలం వెళ్తున్నారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలా చేయడం వలన మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

https://x.com/pulsenewsbreak/status/2082391086526513492?s=20

అయితే, అరుణాచలంలో దక్షిణం వైపు మోక్షమార్గం ఉంటుంది. అందులో నుంచి వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళ మోక్షమార్గంలో ఇరుక్కుని బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడింది. లోపలే చిక్కుకుపోవడంతో బయటకు రాలేక నానా ఇబ్బందులు పడింది. ఎంతో ప్రయత్నించినా బయటకు రాలేక.. శ్వాస తీసుకోవడానికి మహిళ ఇబ్బందులు పడటంతో అక్కడే ఉన్న భక్తులు ఇది వెంటనే ఆమెను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. ఇదిలాఉండగా, కొన్ని రోజుల క్రితమే.. రాజమండ్రికి చెందిన మణికుమార్ (36) ఈ మోక్ష మార్గంలో చిక్కుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. శ్వాస అందక ఆయన మృతి చెందినట్టు తెలిసింది.

#mokshamarg#tamilanadu#arunachalam#viralnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి