తెలంగాణ

Breaking : సీఎం రేవంత్‌కు తప్పిన పెనుప్రమాదం

రచన: Kumar3 నిమిషాల పఠనం

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్ లైన్స్ 6e717 విమానంలో నిన్న రాత్రి బయలు దేరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఆయన నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో ఎయిర్ లైన్స్ 6e717 విమానంలో నిన్న రాత్రి బయలు దేరారు.అయితే, విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదని తెలిసింది.

పైలట్లు విమానాన్ని రన్ వే మీద ల్యాండింగ్ చేసినట్లే చేసి మళ్లీ టేకాఫ్ చేశారు. ఈ క్రమంలోనే 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టినట్టు తెలిసింది.చివరకు రాత్రి 8.35 గంటలకు సురక్షితంగా విమానం ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో 229 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

చాలా సేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ఏమైందో అని అంతా కంగారు పడినట్టు తెలిసింది.దీనికి తోడు విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండటంతో ఏం జరుగుతుందోనని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురైనట్టు తెలిసింది.మొత్తానికి విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో.. అటు ప్రయాణికులు ఇటు సీఎం సిబ్బంది క్షేమంగా ఊపిరిపీల్చుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది.

#cm revanth reddy#flight safe landing#hyderabad#delhi tour
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి