క్రీడలు

Ajinkya Rahane: టీమిండియా స్టార్ క్రికెటర్ రహానే రిటైర్మెంట్ ప్రకటన!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భారత సీనియర్ బ్యాటర్, ముంబై స్టార్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. "సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి" అంటూ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు.

 భారత సీనియర్ బ్యాటర్, ముంబై స్టార్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. "సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి" అంటూ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు.

గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఈ వెటరన్ ఆటగాడు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు దారి సుగమం చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.  మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూ తన అసమానమైన బ్యాటింగ్ నైపుణ్యంతో, కవర్ డ్రైవ్స్, క్లాసిక్ షాట్లతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

రహానే క్రికెట్ కెరీర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన చారిత్రాత్మక బోర్డర్-గావస్కర్ సిరీస్ విజయం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కీలక ఆటగాళ్లు గాయపడటం, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగెళ్లిన కష్టసమయంలో రహానే జట్టు బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత, మెల్‌బోర్న్ టెస్టులో ఆయన సాధించిన అద్భుతమైన సెంచరీతో జట్టులో స్ఫూర్తినిచ్చారు.

 బ్యాటింగ్‌లోనే కాకుండా టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్‌గా గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుంటూ భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో నిశ్శబ్ద యోధుడిలా కీలక పాత్ర పోషించాడు. సంప్రదాయ టెస్టుల్లోనే కాకుండా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్ల తరఫున ఆడి, తన క్లాసిక్ షాట్లతో పొట్టి ఫార్మాట్‌కూ తాను సరైన అభ్యర్థినేనని చాటాడు. దేశవాళీలో ముంబై రంజీ జట్టుకు వెన్నెముకలా నిలిచిన రహానే నిష్క్రమణతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది.

https://x.com/DynamiteNews_/status/2082693438752129095?s=20

 

#Ajinkya Rahane Retirement#Border Gavaskar Trophy#Ajinkya Rahane Captaincy#Melbourne Test Century#Indian Cricket Team#Mumbai Cricket Association
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి