Toxic: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో టాక్సిక్ సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ కి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అసాధారణమైన క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాంటి స్టార్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఎంతో, ప్రతిష్ఠాత్మకంగా డైనమిక్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా టాక్సిక్ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందులో యష్ తో పాటు కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, టొవినో థామస్, రుక్మిణి వసంత్ సహా పలువురు క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు. కేవిన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 'తబాహి'.. అంటూ సాగే ఈ సాంగ్‌లో యష్ అండ్ కియారా అడ్వానీల రొమాన్స్ అదిరిపోయింది. విశాల్ మిశ్రా సంగీతం అందించాడు.
ఇక, హిందీ సాహిత్యాన్ని రాజ్ శేఖర్ రాశాడు. కన్నడలో యోగరాజ్ భట్, తెలుగులో ప్రముఖ లిరిసిట్ రామజోగయ్య శాస్త్రి, తమిళంలో విఘ్నేష్ శివన్, మలయాళంలో రఫీఖ్ అహ్మద్ సాహిత్యం సమకూర్చారు. ఇలా, ఒకేసారి పలు ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ పాటను రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇప్పటికే, మేకింగ్ వీడియోస్‌లో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ వర్కింగ్ స్టైల్ ఎంతో ఇంటెన్సిటీతో కనిపించింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్‌తో సినిమాలో అన్ని అంశాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని అర్థమవుతోంది. మొత్తానికి టాక్సిక్ నుంచి వచ్చిన తబాహి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.












