Nithin: యూత్ స్టార్ గా నితిన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ, సరైన కథలు ఎంచుకోలేకపోవడంతో గత కొంతకాలంగా సక్సెస్‌లు దక్కడం లేదు. గత చిత్రం తమ్ముడు కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, దిల్ రాజు బ్యానర్‌లో చేయాల్సిన ఎల్లమ్మ సినిమా చేజారిపోయింది. దాంతో, తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం నితిన్ దర్శక ద్వయం సోము, నర్రి అనే వాళ్ళతో సినిమాను చేస్తున్నాడు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అని సమాచారం. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం మేరకు, ఈ ప్రాజెక్ట్‌లో బేబీ సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య చేరింది.
ఇంతకముందే, దీని గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చాయి. మూవీ ఓపెనింగ్ సమయంలో హీరోయిన్‌గా మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ ని ఎంపిక చేశారు. కారణాలేమిటో తెలియదు గానీ, ఇప్పుడు సెట్స్‌లోకి వైష్ణవి వచ్చి చేరింది. దాంతో, ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్ అనుకున్నారు. కానీ, ఇప్పుడు అదే నిజమైంది.
వైష్ణవి చైతన్య ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిక్‌లో చేస్తోంది. బేబీ సినిమాతో ఈ జంట బాగా ఆకట్టుకుంది. మళ్ళీ, ఈ జోడీ కలిసి సినిమా చేస్తుండటం..ఇటీవల వచ్చిన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో గ్యారెంటీగా మళ్ళీ బేబీ జంటకి హిట్ దక్కుతుందనుకుంటున్నారు. కాగా, సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి నటించిన జాక్ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. సో వైష్ణవి ఇలాంటి సమయంలో నితిన్ లాంటి మిడ్ రేంజ్ సరసన ఛాన్స్ అంటే లక్కీనే.












