సినిమా

Buchi Babu Sana: మహేష్ బాబు కోసం కథ రాస్తున్నాడా?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Buchi Babu Sana: బుచ్చిబాబు సానా..సుకుమార్ శిష్యులలో అగ్ర దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. మొదటి సినిమా ఉప్పెన తో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టాడు. మెగా కాంపౌండ్ లో చేరడం అంటే అంత ఈజీ కాదు. కానీ, బుచ్చిబాబు కథతో మెగాస్టార్ నుంచి మిగతా వారందరినీ మెప్పించాడు.

Buchi Babu Sana: బుచ్చిబాబు సానా..సుకుమార్ శిష్యులలో అగ్ర దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. మొదటి సినిమా ఉప్పెన తో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టాడు. మెగా కాంపౌండ్ లో చేరడం అంటే అంత ఈజీ కాదు. కానీ, బుచ్చిబాబు కథతో మెగాస్టార్ నుంచి మిగతా వారందరినీ మెప్పించాడు. పంజా వైష్ణవ్ తేజ్‌కి మంచి మైలేజ్ ఇచ్చాడు. అలాగే హీరోయిన్‌గా కృతిశెట్టికి లైఫ్ ఇచ్చాడు.

అయితే, జూనియర్ ఎన్‌టిర్ కోసం రాసుకున్న కథను రామ్ చరణ్‌తో చేసి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు బుచ్చిబాబు. వాస్తవానికి పెద్ది చిత్రాన్ని తారక్‌తో చేయాల్సింది. కానీ, కథ నచ్చకపోవడంతో సింపుల్‌గా సైడ్ అయ్యాడు. అదే కథ చరణ్ అండ్ చిరు లకి విపరీతంగా నచ్చింది. కానీ, ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించలేకపోయారు. బుచ్చిబాబు నరేషన్ బావున్నా కూడా, చరణ్ మీద ఈ ప్రయోగం పనిచేయలేదు. ఫలితంగా ఫ్లాప్ సినిమాగా పెద్ది మిగిలింది.

ఇప్పుడు, బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమా కథను తయారు చేసే పనిలో ఉన్నాడు. ఈసారైనా ఎన్‌టిర్ ని మెప్పిస్తాడనుకుంటే, బుచ్చిబాబు చూపు సూపర్ స్టార్ మహేష్ బాబుపై పడింది. మహేష్ కోసం ఓ కథను రాసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే, మహేష్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకి అవకాశం ఇవ్వడనే మాట ఓ సందర్భంలో పూరి జగన్నాధే చెప్పాడు.

ప్రస్తుతం మహేష్..వారణాసి సినిమాలో నటిస్తున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దాదాపు 1300 కోట్ల రూపాయలతో రూపొందిస్తున్నాడు. 2027 లో ఈ సినిమాను 20 భాషల్లో, 120 దేశాలలో రిలీజ్ చేయనున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్ చేసిన తర్వాత, మహేష్ బాబు ఫ్లాప్ తీసిన బుచ్చిబాబుకి ఛాన్స్ ఇస్తాడా? అంటే డౌటే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

#buchibabusana#maheashbabu#sukumar#ssrajamouli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి