సినిమా

Fauzi: నిర్మాతలకి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్..డీల్ క్యాన్సిల్ అవుతుందా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నవే. అయితే, బాహుబలి నుంచి ఆయన నటిస్తున్న ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. పలుమార్లు వాయిదా పడటం, దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రంతో నిర్మాతలపై ఒత్తిడి తెస్తూ..ట్వీట్స్ పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ఇదివరకు చూసిందే.

Fauzi: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నవే. అయితే, బాహుబలి నుంచి ఆయన నటిస్తున్న ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. పలుమార్లు వాయిదా పడటం, దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రంతో నిర్మాతలపై ఒత్తిడి తెస్తూ..ట్వీట్స్ పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ఇదివరకు చూసిందే. ఇప్పుడు కూడా అదే మొదలైంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇన్స్టా ఫేమ్ ఇమాన్షి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇప్పటికే, సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం..మోకాలికి సర్జరీ జరగడం వల్ల ఆలస్యం అయింది. దానికి తోడు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ కూడా మేకర్స్ నుంచి రావడం లేదు.

దాంతో, ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. సోషల్ మీడియాలో ఫౌజీ సినిమా నుంచి అప్‌డేట్స్ కావాలని నిర్మాతలపై ఒత్తిడి తెస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు జరిగే ఓ పీరియాడిక్ కథతో ఇది తెరకెక్కుతోంది. ప్రభాస్ లుక్..మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని మాత్రం తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఫౌజీ సినిమాను ప్రముఖ డిజిటల్ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నదట. వారు పెట్టిన డెడ్‌లైన్ ప్రకారం డిసెంబర్ వరకు సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంది. లేదంటే ఆ డీల్ తగ్గించుకోనుందట. లేదంటే, ఒప్పందంలో మార్పులు జరుగుతాయని మేకర్స్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి, మరి ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్, మరోవైపు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒత్తిడి మేరకు ఫౌజీ సినిమాను డిసెంబర్ వరకూ రిలీజ్ చేయగలరా లేదా.

#prabhas#fauzi#hanuraghavapudi#netflix
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి