National

Floods : అస్సాంలో కుండపోత వర్షాలు.. ఒక్కరోజే 21 మంది మృతి

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మరోసారి ఆకస్మిక వరదలు పలు జిల్లాలను చుట్టుముట్టాయి. దీంతో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మరోసారి ఆకస్మిక వరదలు పలు జిల్లాలను చుట్టుముట్టాయి. దీంతో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. వరదల ధాటికి గత 24 గంటల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ ఏడాది సంభవించిన వరదల్లో మరణించిన వారి మొత్తం సంఖ్య 31కి చేరినట్లు అస్సాం విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ASDMA) తెలిపింది.

అస్సాంలో గల మొత్తం 16 జిల్లాల్లో దాదాపు 5.64 లక్షల మంది ప్రజలు వరద బాధితులుగా మారారని అర్ధరాత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్నట్టు సమాచారం. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలో విషసర్పాలు కొట్టుకొస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుతం పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు జనాలు వెళ్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో పోలీసులు, విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెనువెంటనే తరలిస్తున్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న శివసాగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13 మంది మరణించినట్టు తెలిసింది.

ఇక చరాయిదేవ్‌లో 5, గోలాఘాట్‌లో ఇద్దరు, జోర్‌హాట్‌లో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారుర. నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి.సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

#Heavy Floods#Assam#21 members died#national#Rains
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి