తెలంగాణ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
డీఎస్పీ మాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు.
సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. తనిఖీలు పూర్తైన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సోదాలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.












