పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి వారి జీవితాన్ని సన్మార్గంలో నడిపించాల్సి గురువులు కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. కోపంలో తాము చేస్తున్నది సరైనదేనా? అని కనీసం ఆలోచించలేకపోతున్నారు. తమ ప్రతాపం మొత్తం అయాయకపు పిల్లల మీద చూపిస్తున్నారు.చిన్నతనంలో విద్యార్థులు చదవకపోవడం, అల్లరి చేయడం కామన్. వారిని సన్మార్గంలోకి తేవాల్సిన గురువులే కాలయముడిలా మారి విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థిని చితకబాదాడు. ఈ ఘటనలో విద్యార్థి చేయి విరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వివరాల్లోకివెళితే.. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని శ్రీ నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి తేజపై హెడ్ మాస్టర్ సురేష్ బాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు.విపరీతంగా కొట్టగా విద్యార్థి చేయి విరిగిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పాఠశాలకు చేరుకుని తీవ్ర గాయాలైన తేజను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
https://x.com/RTVnewsnetwork/status/2079582590219247651?s=20
అతని చేయికి కుట్లు పడినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో హెచ్‌ఎం సురేష్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఆగ్రహంతో పాఠశాల ఫర్నిచర్‌ను ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు ధ్వంసం చేశారు. సదరు ప్రైవేట్ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. అయితే, హెడ్ మాస్టర్ .. విద్యార్థి మీద అంతలా ఎందుకు విరుచుకపడ్డారు? చేయి విరిగేలా దాడి ఎందుకు చేశారు? అనేది తెలియాల్సి ఉన్నది.












