సినిమా

Tollywood: వరుణ్ తేజ్‌తో మారుతి క్రేజీ ప్రాజెక్ట్‌.. కానీ..?

రచన: Anshu3 నిమిషాల పఠనం

Tollywood: ‘రాజాసాబ్’ ఫలితం తర్వాత దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాపై తీవ్రంగా దృష్టి సారించారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఆయన, టాలీవుడ్‌లో పలువురు కథానాయకులకు కథలు వినిపించినట్లు ప్రచారం సాగింది. అయితే, ఇవేవీ అధికారికంగా ఖరారు కాకపోవడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో మారుతి ఓ పరిమిత బడ్జెట్ సినిమా చేయబోతున్నారంటూ కథనాలు వైరల్ అయ్యాయి. వరుణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ వైవిధ్యమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంపై వరుణ్ తేజ్ సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మారుతి కాంబినేషన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని తేల్చిచెప్పాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తను కమిట్ అయిన సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. రీసెంట్‌గా ‘కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైనప్పటికీ, ఆ నొప్పిని భరిస్తూనే ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నిహారిక నిర్మాణంలో రాబోతున్న ‘బరి’ చిత్రంలో ఆయన నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యే వరకు కొత్త సినిమాలేవీ లైన్‌లో పెట్టే ఆలోచనలో వరుణ్ లేరని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు తెలుస్తోంది.

#varuntej#directormaruthi#therajasaab#prabhas
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి