పునాదులు వేసింది ఫినిక్స్ గోపి
అమలు చేసింది హానర్ హోమ్స్ పేరుతో మొబైల్స్ అమ్మే షాపు వారే?
స్క్వేర్ స్పేస్ పుట్టిందే ఈ విలువైన భూముల కోసం
ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినప్పుడు ఇచ్చింది లక్ష మాత్రమే?
డైరెక్టర్స్‌గా ఫినిక్స్ ఉద్యోగులు మురళీధర్, శ్రీనివాసులు?
2021 నవంబర్ 2న చేరగానే 11న జీఓసీఎల్ ప్రకటన
ఆ తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్, బిగ్ సీ రాగానే ఫినిక్స్ ఉద్యోగి ఔట్?
నెక్స్ట్ డిజిటల్ పేరుతో హిందుజా ఓనర్స్ రంగంలోకి?
ఈ తప్పిదంతోనే తల దించుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ టీం
విచ్చలవిడి భూ దందాపై ఏ పార్టీ స్పందించదా?
333 ఎకరాలకు అమోయ్ కుమార్ ఆమోదం వెనుక భారీ ప్లాన్
ప్రభుత్వానికి చెందాల్సిన కూకట్ పల్లి ఇండస్ట్రీ భూముల గూడుపుఠాణిపై ఇన్వెస్టిగేషన్ స్టోరీ
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ ,
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
భూములపైనే నాయకుల జీవితాలు?
రాత్రికి రాత్రి కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలి. ఓ లిటిగేషన్ ల్యాండ్ పట్టుకుని అందరికీ లంచాలు ఇచ్చి రికార్డులు మార్చేసి కబ్జా పెట్టాలి. ఇదంతా అన్ అఫీషియల్. చేసేది తప్పయినా అఫీషియల్‌గా అనిపించాలి. ఇది బిజినెస్ మ్యాన్ థియరీ. కూకట్ పల్లి భూముల్లో కూడా అదే జరిగింది. ఒకేచోట 850 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిస్తే అందరికంటే ముందుగా ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు కూకట్ పల్లిలో అదే జరిగింది. బెంగుళూరుతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్‌లో భారీగా ఐడీఎల్ కంపెనీ భూములు ఉన్నాయి. దీనిని గుర్తించిన హిందుజా కంపెనీ 2003లో బెంగళూరు, హైదరాబాద్ భూముల కోసమే కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి. బెంగళూరులో ఆ భూములతో భారీ లాభాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌పై కన్నేసింది. కానీ ప్రభుత్వం అంతా ఇచ్చిన భూమియే, రైతుల నుంచి సేకరించింది. 1985 ఫారెస్ట్ యాక్ట్ అప్పుడు లేదు. 1961లో ఫారెస్ట్‌ను దున్నుకుంటున్న రైతులకు 200 ఎకరాలు ఇవ్వాలని 1962లోనే డీ నోటిఫై చేశారు. ఆ తర్వాత రైతులను కాదని డెటోనెటర్స్ కంపెనీకి వాళ్ల వద్ద నుంచి బలవంతంగా తీసుకుని ఇచ్చారు. కానీ కంపెనీ ఏనాడు భూముల కోసం ప్రభుత్వానికి డబ్బు కట్టలేదు. ఆర్టీఐలో వేసినా ఆ రికార్డులు లభ్యం కాలేదు. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నది ఆ భూ మాఫియా వ్యవహారమే.
బెంగుళూరు అయిపోయింది.. హైదరాబాద్‌పై పడ్డారు
స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి పార్ట్ 4 లో చెప్పినట్లు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరుతో షేర్ హోల్డర్స్‌కు ఎకరం రూ.15 కోట్ల కంటే ఎక్కువ రేట్ రాదని చెప్పారు. లీగల్‌గా ఫైట్ చేసిన వ్యవహారంతో మొత్తంగా షేర్ హోల్డర్స్‌ను మోసం చేసి ఎకరం రూ.8 కోట్లు కూడా లేదన్నట్లు కంపెనీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. అదే రోజుల్లో హెచ్ఎండీఏ కోకాపేటలో వేలం వేస్తే రూ.60 కోట్లు పలికింది.
స్టోరీకి సబ్జెక్ట్ లింక్?
2008లో లేఖ ఇస్తే 2009లో మంత్రివర్గ నిర్ణయాలతో 76 ఎకరాలకు గాను 10 ఎకరాలు యాగా అసోసియేట్స్‌కు ఇచ్చారు. ఆ రోజు జరిగిన దందాకు రూపం లేదు. యాగా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసినందుకు సీబీఐ కేసు విచారణ జరిగింది.
బీఆర్ఎస్ డబ్బుల మాఫియా?
రాష్ట్రమే కాదు డబ్బులు ఉంటే దేశాన్నే ఏలొచ్చు. ఆనాడు బిహార్ ఎన్నికల ఖర్చు ఎంత అని కేసీఆర్ లెక్కలు వేశారు. దీని వెనుక ఎన్నో భూముల క్లియరెన్స్ డబ్బులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటిలో అప్పటికే క్లియర్ చేసుకున్న కూకట్ పల్లి భూమి కూడా ఉన్నది.
333 ఎకరాలకు క్లియరెన్స్ ఎలా?
కూకట్ పల్లిలోని ఐడీఎల్ కంపెనీ కింద ఉండే 850 ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ చేశారు? అందుకు హిందుజా కంపెనీ తీసుకున్నప్పటి నుంచే కోర్టు కేసులు, 12 ఏండ్ల తర్వాత లీజ్ భూములు ఏంటో సుప్రీంకోర్టు తేల్చింది. కానీ ఎండోమెంట్ ల్యాండ్స్‌తో పాటు, రైతులకు న్యాయం జరగని నిజాలు, ఎకరాకు రూ.1,000 ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం చెప్పినా కోర్టుకు వెళ్లి చెల్లించని వైనం, ఏ రోజు కూడా ట్రెజరీకి ఒక్క రూపాయి ఇవ్వని నిజాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. చివరకు ఐడీఎల్ భూములను ధారదత్తం చేశారు.
హానర్ గ్రూప్ నుంచి స్క్వేర్ స్పేస్ ఇన్‌ఫ్రా వరకు డైరెక్టర్ల ప్రయాణం
15-03-2016
- హానర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు
బాలచంద్రుడు, స్వప్న కుమార్, వెంకటేశ్వర్లు, రాజమౌళి
2017 - 2019
- హానర్ గ్రూప్ విస్తరణ(ఎల్ఎల్‌పీలు, ఇతర సంస్థలు)
హానర్ హోమ్స్ ఎల్ఎల్‌పీ, హానర్ ఎస్టేట్స్ ఎల్ఎల్‌పీ, హానర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ, హానర్ వెంచర్స్ ఎల్ఎల్‌పీ, హానర్ కమ్యునిటీస్ ఎల్ఎల్‌పీ, హానర్ హాస్పిటాలిటీ ఎల్ఎల్‌పీ
2021 - 2022
- స్క్వేర్ స్పేస్ ఇన్‌ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్
02-11-2021
స్వప్నకుమార్ - అడిషనల్ డైరెక్టర్
వెంకటేశ్వర్లు - అడిషనల్ డైరెక్టర్
20-01-2022
బాలచంద్రుడు - అడిషనల్ డైరెక్టర్
రాజమౌళి - అడిషనల్ డైరెక్టర్
22-01-2022
శ్రీనివాసులు - డైరెక్టర్












