Rahul Gandhi: ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని నివాసం ఎదుట 3 గంటలుగా ధర్నాకు దిగిన ప్రతిపక్ష నేతల రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని అక్కడి నుంచి బస్సుల్లో మరో చోటుకి తరలించారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసిన ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా ఖాళీ చేయించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని నివాసం ముందు 3 గంటలకుపైగా కాంగ్రెస్ నేతల ధర్నా సాగింది.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై లాఠీచార్జ్ కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీచార్జ్ కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన చేశారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












