సినిమా

NTR : గర్జిస్తూ మళ్ళీ వెనక్కి రావాలి బాబాయ్..వైరల్‌గా మారిన తారక్ ట్వీట్

రచన: Anshu4 నిమిషాల పఠనం

NTR : నట సింహం నందమూరి బాలకృష్ణకి గాయాలైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆయనకి మెసేజస్, కాల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు, హరిక్ష్ణ తనయుడు, పాన్ ఇండియన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

NTR : నట సింహం నందమూరి బాలకృష్ణకి గాయాలైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు బాలయ్య త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆయనకి మెసేజస్, కాల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు, హరిక్ష్ణ తనయుడు, పాన్ ఇండియన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ప్రస్తుతం, ఆ పోస్ట్ అంతటా బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఎన్‌బీకే 111 పేరుతో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో శరవేగంగా సాగుతోంది. బాలకృష్ణ, మంచు మనోజ్‌ మధ్య ఓ భారీ యాక్షన్‌ సీన్ ను షూట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

సాధారణంగా యాక్షన్ సీన్స్ అంటే బాలయ్య అసలు డూప్ సహాయం తీసుకోడని తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆయన ఎటువంటి డూప్ లేకుండా ఫైట్ సీన్ చేస్తుండగా.. జారిపడ్డారట. దీంతో బాలయ్య మోకాలికి దెబ్బలు గట్టిగా తగిలినట్లు యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే షూటింగ్‌ కి బ్రేక్ ఇచ్చి బాలకృష్ణను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారట. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి, మోకాలికి స్కానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎలాంటి, ప్రమాదము లేదని డాక్టర్లు చెప్పారట. ప్రస్తుతం బాలయ్య కాకినాడ పోర్ట్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా, తెలియలేదు. దీంతో, విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, బాబాయ్ కి త్వరగా నయం కావాలని కోరుకుంటూ..ట్విట్టర్( ఎక్స్) హ్యాండిల్ లో పోస్ట్ పెట్టాడు. ఇందులో, “త్వరగా కోలుకోండి, బాల బాబాయ్. మీరు వేగంగా కోలుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ గర్జిస్తూ ఫుల్ ఫామ్ లో వెనక్కి తిరిగి రావాలి”.. అంటూ తారక్ పోస్ట్ పెట్టాడు. ఇది నందమూరి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, తారక్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి నందమూరి అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

#ntr#balakrishna#gopichandmalineni#nbk111
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి