Pooja Hegde: పూజా హెగ్డే..ఈ పొడుగు కాళ్ళ సుందరి ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉండిందో అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ లో పూజా కి విపరీతమైన క్రేజ్ ఉండేది. అంతేకాదు, భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైన పూజా, అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం, అల వైకుంఠపురములో, ఎన్‌టిర్ సరసన అరవింద సమేత, ప్రభాస్ సరసన రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటించింది.
అంతేకాదు, సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన మహర్షి, తమిళంలో విజయ్ లాంటి స్టార్ సరసన సినిమాలు చేసింది. అయితే, వరుస ఫ్లాప్స్ రావడం..లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే నెగిటివ్ గా కామెంట్స్ చేయడంతో అందరూ పక్కన పెట్టారు. అప్పటి నుంచి పూజా హెగ్డే కెరీర్ మొత్తం తలకిందులైంది. అడపా దడపా ఐటమ్మ్ సాంగ్స్ చేసినా..అవి ఉపయోగపడలేదు. మళ్ళీ ఇటు తెలుగులో అటు తమిళంలో హీరోయిన్‌గా ఛాన్సుల కోసం వెంపర్లాడింది.
తాజా, సమాచారం మేరకు, మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ అందుకుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం, అల్లు అర్జున్..అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చేస్తున్నాడు. దీని, తర్వాత కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుందట.
అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటకి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది.వీరి కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సంచలన విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద ఈ జోడీ కలిసి నటిస్తే చూడాలనుకుంటున్నారు. ఆ ఛాన్స్ లోకేష్ కనగరాజ్ సినిమాతో వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి, దీనికి సంబందించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.












