Dimple Hayati: కొన్ని కాంబినేషన్స్ ని చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులే కాదు, సినీ వర్గాలలోనూ మంచి ఆసక్తి ఉంటుంది. అలాంటి, కాంబినేషనే మాస్ మహారాజ్ రవితేజ-డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘కిలాడీ’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైనా కూడా ప్రేక్షకులను మాత్రం బాగానే ఎంటర్‌టైన్ చేసింది.
ఇక, ఇటీవల వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనూ రవితేజ-డింపుల్ జంట అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేసింది. కానీ, డింపుల్ స్కిన్ షో సినీ లవర్స్ ని హీటెక్కించింది. సినిమాలు ఫ్లాపైనా, వీరిని సిల్వర్ స్కీన్ మీద చూసేందుకు అందరూ బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు మరోసారి, రవితేజ-డింపుల్ హయాతిల కాంబో రిపీట్ అవుతుందట. వీరిద్దరూ కలిసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ లేటెస్ట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదాశనివారం చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన వివేక్ ఆత్రేయ..రవితేజతో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడట.
ఈ సినిమాలో హీరోయిన్‌గా డింపుల్ హయాతి దాదాపుగా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. వివేక్ రాసుకునే కథ, స్క్రీన్ ప్లే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. క్రైమ్ కామెడీ జానర్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాలు తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ సిద్దం చేశాడట. త్వరలో, ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది.












