ఆర్ఎక్స్ 100 మూవీతో ఒక్కసారిగా భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్.. ఈ చిత్రంలో ఆమె చేసిన క్యారెక్టర్ ఆ సమయంలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అజయ్ భూపతి.. పాయల్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ రాజ్‌ఫుత్ పాత్రను చూసి ప్రేక్షకులు ఒకలా అర్థం చేసుకున్నారని.. కానీ అసలు ఉద్దేశం మాత్రం మరోలా ఉందని ఆ డైరెక్టర్ వ్యాఖ్యానించారు.
అలాగే పాయల్ రాజ్‌ఫుత్ నింఫోమేనియా (సెక్స్ అడిక్షన్)తో బాధపడే మహిళ పాత్రలో నటించిన మూవీ మంగళవారం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులోని పాత్రను భారతీయ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా చూపించడం అద్భుతమని కొనియాడిన అజయ్ భూపతి.. ఇది పూర్తిగా కొత్త ప్రయత్నమని ప్రశంసించారు. కేవలం కథ మాత్రమే కాదు, ఆ సినిమా మేకింగ్ స్టైల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు.
ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అయినప్పటికీ, ప్రేమకథకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మూవీలో రస్టిక్ బ్యాక్‌డ్రాప్, సహజమైన పాత్రలు, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మొదటి పది నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, హీరోయిన్‌గా రషా తడానీ వస్తున్న లేటేస్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం.
ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తుండగా అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్‌పై దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.












