Kiran Abbavaram: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ జెనరేషన్ హీరోలు గానీ, అప్పటి జెనరేషన్ హీరోలు గానీ, ఒక హీతో ప్రాజెక్ట్ అనుకోని, అది పలు కారణాల వల్ల మరో హీరో వద్దకి వెళ్లిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా, చెప్పాలంటే లెక్కే లేదు. ఇప్పుడు, అలాగే.. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం కూడా ఓ భారీ సినిమాని వదులుకున్నాడు.
తానే, ఈ సినిమాను మిస్ చేసుకున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు, ఈ హీరో వదులుకున్న ప్రాజెక్ట్ ఏకంగా 100 కోట్లది కావడం షాకింగ్ విషయం. ఈ సినిమానే ఇప్పుడు మన మెగా హీరో చేస్తున్నాడు. ఇంతకీ కిరణ్ వదులుకున్న ఆ సినిమా ఏదనుకుంటున్నారా? ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటి గట్టు’. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా సమయంలోనే రోహిత్ పరిచయం అయ్యాడట. అతను చాలా మంచి మనిషి అని.. సినిమా చర్చల్లో భాగంగా ముందు చిన్న సినిమా అంటే రెండు కోట్లలో కంప్లీట్ అయ్యే కథ అని చెప్పాడట.
అయితే, కాస్త ఎక్కువ బడ్జెట్ తో తీసే కథను అడిగాడట కిరణ్. అప్పుడు చెప్పిందే సంబరాల ఏటి గట్టు. కాకపోతే, ఆ సమయంలో కిరణ్ సినిమాలు ప్లాప్స్ లో ఉండడం వల్ల, మార్కెట్ పరిస్థిని దృష్టిలో పెట్టుకొని, అంత పెద్ద బడ్జెట్ సినిమా ఇప్పుడే వద్దని చెప్పాను. చిత్ర నిర్మాత నిరంజన్ కూడా తనతో చేద్దామనే చెప్పినా, ఆ ప్రాజెక్ట్ తనతో ఇప్పుడు వద్దని చెప్పేసాను.
ఇప్పుడు, అదే సాయి ధరమ్ తేజ్ అన్న చేస్తుండటం.. చాలా హ్యాపీగా అనిపించింది..అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు. ఆ రకంగా సంబరాల ఏటి గట్టు లాంటి, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాని కిరణ్ మిస్ చేసుకున్నాడని స్వయంగా తానే చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












