Spirituality

Spirituality: తొలి ఏకాదశి రోజు 12 రాశులు చేయవలసిన పరిహారం!..

రచన: Venu5 నిమిషాల పఠనం

తొలి ఏకాదశి రోజు మీ రాశి ప్రకారం ఈ చిన్న పరిహారం చేస్తే.. విష్ణుమూర్తి కృపతో మీ జీవితంలో శుభఫలితాలు మొదలవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు! అవి ఏంటో తెలుసుకుందాం!..

హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం.. తొలి ఏకాదశి నుంచే మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారని నమ్మకం. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అని అంటారు. అలాగే ఈ పర్వదినం నుంచే పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

తొలి ఏకాదశిన భక్తులు రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి జాగరణ చేస్తూ.. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, అన్నానికి దూరంగా ఉండాలని.. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే విష్ణుమూర్తిని పూజించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించాలని పెద్దలు చెబుతారు.

ఇక శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం 12 రాశుల వారు చేయాల్సిన పరిహారాలు చూస్తే..

మేషం, వృశ్చిక రాశుల వారు.. విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. బెల్లం దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు.

వృషభం, తులా రాశుల వారు.. స్వామివారికి తెల్లటి చందనం, పాయసం లేదా తెల్లటి పూలను సమర్పించాలని. వీలైతే నెయ్యి దానం చేయడం మంచిదని అంటారు.

మిథునం, కన్యా రాశుల వారు.. తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించి.. ఆకుపచ్చని పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

కర్కాటక రాశి వారు.. స్వామివారికి పాలు లేదా పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజలో ముత్యం లేదా వెండి వస్తువులను ఉంచుకోవచ్చు.

సింహ రాశి వారు.. కుంకుమపువ్వు కలిపిన పాలు లేదా పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి.. గోధుమలు దానం చేయడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

ధనుస్సు, మీన రాశుల వారు.. పసుపు రంగు పువ్వులు, అరటిపండ్లు, పసుపు వస్త్రాలను విష్ణుమూర్తికి సమర్పించి.. శనగపప్పు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుందని నమ్మకం..

మకరం, కుంభ రాశుల వారు.. విష్ణుమూర్తిని పూజించడంతో పాటు నల్లటి నువ్వులను దానం చేయాలి. నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల శని దోషాలు తొలగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా.. తొలి ఏకాదశి రోజున భక్తితో లక్ష్మీనారాయణులను స్మరిస్తూ.. మీ రాశికి అనుగుణంగా చిన్న చిన్న పరిహారాలు, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు తొలగి.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. అయితే ఇవన్నీ ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన పరిహారాలు మాత్రమే. భక్తి, శ్రద్ధ, దానధర్మాలే ఈ పర్వదినం యొక్క అసలైన సారాంశం.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..

#Spirituality#Toli Ekadashi#loard vishnu murthi#Remedies#12 zodiac
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి