ఒకే గ్రామంలోని భూమికి 8 ఖాతా నెంబర్స్‌తో బదులాయింపులు
అగ్రికల్చర్ ల్యాండ్స్‌గా ఎలా మారాయి?
ధరణి ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో ఈ భూ బాగోతం బయట పెట్టగలరా?
అధికారులు హైకోర్టుకు ఏం సమాధానం ఇస్తారో?
బడా భూ స్కాం కప్పిపుచ్చుకునేందుకు పాట్లు
భూ భారతిలో స్క్వేర్ స్పేస్‌కు రాసి ఇచ్చిన వైనం
కూకట్ పల్లి భూములు కొల్లగొటిన తీరుపై పార్ట్ -6
స్వేచ్ఛ ఛైర్మన్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ..
కూకట్ పల్లిలో వందల ఎకరాల్లో వ్యవసాయం?
గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ప్రభుత్వ భూములు అప్పగించిన వ్వవహారం సీరియస్‌గా మారుతోంది. ఈ నెల 23న హైకోర్టుకు ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆర్టీఐ ద్వారా 1,500 పేజీలు పిటిషనర్ సేకరించడంతో ఎలాంటి పేపర్స్‌ను కొత్తగా సమర్పిస్తారో చూడాలి. అయితే ఇదే భూములపై స్వేచ్ఛ ఛైర్మన్ ఇన్వెస్టిగేషన్‌లో కంపెనీల డైరెక్టర్స్ వ్యవహరమే కాదు, ఇండస్ట్రీ భూములను అగ్రికల్చర్ ల్యాండ్స్‌గా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది. ఇండస్ట్రియల్ భూములు నాన్ ఇండస్ట్రియల్‌గా వాడుకుంటే స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సేల్ డీడ్ చేసుకోవాలి. 2009, 2011, 2013, 2022లో వివిధ డాక్యుమెంట్ల నెంబర్స్‌తో సేల్ డీడ్స్, జీపీఏలు జరిగాయి.
1.2020లో ధరణిలో ఖాతా నెంబర్ 60073 పేరుతో స్క్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సర్వే నెంబర్ 627/2 లోని ఏ.3.39 గుంటలు కూకట్ పల్లి తహశీల్దార్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా సర్వే నెంబర్ 629లో 8.09 గుంటలు. సర్వే నెంబర్ 1011/1/2 లోని 7.02 గుంటలు ధరణి రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.
2. ఇదే కంపెనీ పేరుతో మరో ఖాతా నెంబర్ అయినా 60065లో సర్వే నెంబర్ 1001/4 లో 20.38 గుంటలు 22/06/2023 లో పాస్ బుక్ డేటా కరెక్షన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.
3. ఖాతా నెంబర్ 60066తో 1011/12/2/2 లోని 2.35 గుంటలు నమోదు చేసుకున్నారు. ఈ ఖాతా నెంబర్‌లో మొత్తం చెరువు భూమిగా పహాణీలు చూపిస్తోంది. మిగితా భూమిలో 1011/12/2/1 గా ప్రభుత్వ భూమి 8 ఎకరాలుగా ధరణిలో ఉంచారు.
4. ఖాతా నెంబర్ 60067తో 1011/3/2 లోని 11.28 గుంటలు వసుధర్ బొప్పన ఆథరైజ్డ్‌గా సంతకంతో రికార్డుల్లో ఈ స్క్వేర్ స్పేస్ సిటీ ఇన్ఫ్రా పేరుతో ఉంది.
5. ఖాతా నెంబర్ 60068లోని సర్వే నెంబర్ 1011/2/2 ద్వారా 5.06 గుంటలు భూభారతిలో కనిపిస్తోంది. ఇలా 60069 నుంచి 60073 వరకు వివిధ భూములను అడ్డగోలుగా రికార్డుల్లోకి ఎక్కించుకున్న ఘనత ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీకి , ఫినిక్స్ సిస్టర్ సంస్థ అయిన స్క్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీకే దక్కుతుంది. ఐడీఎల్ కంపెనీకి కి ఖాతా నెం.2539లో సర్వే నెంబర్ 1011/1/1 లో 15.15 గుంటలు, సర్వే నెంబర్ 1011/12/1 లో 166.30 గుంటలు మొత్తం 182.05 ఎకరాలు ఉన్నట్లు ధరణి ఈసీలో, పాస్ బుక్ ఇవ్వడంపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఇంత చేసినా ఎవరూ నోరు మెదపరే?
1965 నుంచి 1985 వరకు ప్రభుత్వానికి రూపాయి చెల్లించలేదని రికార్డులు చెబుతున్నాయి. 333 ఎకరాలను కేవలం జీవోలతోనే కంపెనీ నడిపింది ఐడీఎల్. మూతపడిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అత్యంత విలువైన భూములు ప్రైవేట్ పరం అయ్యాయి. కలెక్టర్ హరీష్ 2021లో ఎకరం వెయ్యి రూపాయలు తీసుకుని 100 ఎకరాలు అప్పగిస్తే, అమోయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా లేకుండా అంతా వారి భూమియే అంటూ మొత్తం కలిపి 333 ఎకరాలను రికార్డుల్లోకి మార్చడం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. హరీష్ రెడ్డి ఇచ్చిన సేల్ సర్టిఫికేట్‌ను సవాల్ చేస్తే కోర్టులో కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయని, అమోయ్ కుమార్ కలెక్టర్‌గా రాగానే అంతా వారిదే అంటూ క్లిన్ చిట్ ఇవ్వడంపై దర్యాప్తు జరగాలి. సుమారు రూ.50 వేల కోట్ల భూములను ప్రభుత్వానికి చెందేలా విచారణ జరపాలి. కాని నేతలందరూ చేసిన బడా భూ స్కాంకి తలా కొంత పంచుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎలక్షన్ ఖర్చులకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇవ్వడంతో ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శలు ఉన్నాయి
పార్ట్ 7లో మరిన్ని నిజాలు చూద్దాం
ఒక్కొక్క డ్యాకుమెంట్‌కు రేట్లు ఎలా పెంచుకున్నారు? గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ హోల్డర్స్ ఎలా నష్టపోయారు? ఈ స్కాంపై ఏఏ వ్యవస్థలకు ఫిర్యాదు చేసి కాపాడుకోవాల్సిన అవసరం సోషల్ యాక్టివిస్ట్స్, తెలంగాణ ప్రజలకు ఉందో పార్ట్ -7లో చూద్దాం.
స్వేచ్ఛ ఛైర్మన్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809












