OG vs DEVARA: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. గ్లోబల్ వైడ్ గా పలు భాషల్లో ఈ ఇద్దరు హీరోలకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అన్‌బిలీవబుల్. వీరి సినిమాలకి బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, డిజిటల్ మీడియంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
శాటిలైట్ లో సినిమా టెలికాస్ట్ ప్రోమో పడితే వచ్చే రేటింగ్ హైయ్యెస్ట్ గా ఉంటుంది. అయితే, కొన్ని సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు..చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనుకునేవారు లెక్కకి మించి ఉంటారు. అయితే, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బాక్సాఫీస్ సెన్షేషనల్ హిట్ ఓజీ ఈటీవి విన్ లో రాబోతోంది.
తాజాగా, దీనికి సంబందించిన కన్‌ఫర్మేషన్ ఇస్తూ..ప్రోమోను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృత అందరిలో మొదలైంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అయితే, ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఎప్పుడు వస్తుందో అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి, దేవర సినిమా ఎప్పుడో వచ్చింది. కానీ, డిజిటల్ మీడియంలో మాత్రం స్ట్రీమింగ్ అవలేదు. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ నటించిన ఓజీ మాత్రం వచ్చేస్తున్నట్టుగా పార్ట్నర్స్ కన్‌ఫర్మ్ చేశారు. దేవర సినిమా ఫలితం బాక్సాఫీస్ వద్ద ఎలా ఉన్నా..తారక్ వన్ మ్యాన్ షో ఆకట్టుకుంది. కొన్ని, సినిమాలు థియేటర్స్ లో ఫ్లాపైనా ఓటీటీలో, శాటిలైట్ లో సూపర్ హిట్ అవుతాయి. మరి, దేవర చిత్రాన్ని ఎప్పుడు తీసుకువస్తారో చూడాలి.












