సినిమా

Tollywood: సంక్రాంతికి "ఫ్యామిలీ ప్యాక్"..ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో కూడానా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమాకి తాజాగా టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ అనే ఫన్నీ టైటిల్ ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇక, వినయాక చవితి పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా..దీనితో, ఈ సినిమా కథాంశం డబ్బు చుట్టూ తిరుగుందని అర్థమవుతోంది.

ప్రస్తుతం, టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ టచ్ చేయని జానర్ లేదు..పికప్ చేయని హీరో లేడు అన్నట్టుగా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఇరుముడి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మైత్రీ వారు. దీని తర్వాత భారీ చిత్రాలను చేస్తున్నారు, కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తున్నారు. నిన్ననే, తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో తెలుగు తమిళ సినిమా జానీ ప్రకటించారు.

ఇప్పుడు, శ్రీవిష్ణు సినిమా టైటిల్ తో పాటు విడుదలపై కూడా క్లన్‌ఫర్మేషన్ ఇచ్చారు. 2027, సంక్రాంతికి శ్రీవిష్ణు-మైత్రీ వారి సినిమా రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ ప్యాక్ అనే టైటిల్ చాలా ఫన్నీగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరికీ డబ్బు సమస్య ఉంది. అలాంటి, మేయిన్ ఎలిమెంట్ చుట్టూ కథ సాగుతుందని హింట్ ఇచ్చారు. కాబట్టి, శ్రీవిష్ణు స్టైల్‌లో ఫ్యామిలీ ప్యాక్ ఉండబోతుందని అర్థమవుతోంది.

ఇక, ఈ సినిమాకి ‘సామజవరగమన’ లాంటి సూపర్ హిట్ మూవీకి స్క్రిప్ట్ అందించిన రచయితలు భాను భోగవరపు, నందు దీనికి కూడా కథ-మాటలు అందిస్తున్నారు. నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అభిరామి, సాక్షి మహదోల్కర్, సుదర్శన్, మాస్టర్ రేవంత్..ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కి సంగీతం అందిస్తున్నాడు. మరి, ఇప్పటికే..2027 సంక్రాంతికి మెగాస్టార్ కాకా, పాన్ ఇండియా సినిమా మహాకాళి, శర్వానంద్ నటిస్తున్న జార్జి క్రిష్, అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ఉన్నాయి. ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో శ్రీవిష్ణు దిగడం అంటే మైత్రీకి చాలా నమ్మకం ఉంది.

#sri vishnu#family pack#mythri movie makers#ram abbaraju
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి