సినిమా

Samantha: సమంతకి సీమంతం..ఎవరెవరు వచ్చారంటే..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి సీమంతం నిర్వహించారు. 'మా ఇంటి బంగారం' సినిమా సమయంలో సమంత గర్భవతి. సాంగ్ సమయంలో ఆమె ప్రగ్నెంట్ అని తెలిసింది. అయినా కూడా సినిమా కోసం అన్నీ జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ పూర్తి చేసింది. చిత్ర దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి, సమంత భర్త రాజ్ నిడిమోరు సమంత గర్భవతి అని తెలిసి చాలా జాగ్రత్తగా చిత్రీకరణ జరిపారు. వినయాకచవితి పండుగ సందర్భంగా ఆమెకి సీమంతం జరిగింది.

తాజాగా, ఈ వేడుకకి సంబందించిన ఫొటోలను, వీడియోలను సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం..ఇవన్నీ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ వేడుకకి..సమంత కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు ఆమె భర్త, ప్రముఖ దర్శక, రచయిత-నిర్మాత రాజ్ నిడిమోరు, క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, సమంత ఒక నోట్ రాసుకొచ్చింది. 'ఈ ఆచారంలో ఒక తల్లిని చూసే విధానం నన్ను ఎంతో కదిలించింది'.. అంటూ సమంత తన ఎమోషన్స్ ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో సమంత-రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ దంపతులు.. ఇదే ఏడాది జూన్‌లో మేము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మా ఇంటి బంగారం ప్రమోషన్స్ సమయంలోనూ సమంత మరోసారి మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నట్టుగా వెల్లడించింది.

కాగా, సమంత నటనకి కొన్నాళ్ళు దూరంగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. కానీ, తన నిర్మాణ సంస్థ ట్రూలాలా నుంచి మాత్రం యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ప్లాన్ చేస్తోంది. ఆఫ్ ది కెమెరా మాత్రం ఆమె యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే, గర్భవతి అయినా కూడా ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో మాత్రం అసలు అశ్రద్ధ చూపించడం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉంది.

#Samantha#Raj Nidimoru#Silpa Reddy#Actress Samantha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి