సినిమా

Naga Chaithanya: ఒక్క సినిమా..అవార్డులు..అదీ చైతూ అంటే

రచన: Anshu4 నిమిషాల పఠనం

Naga Chaithanya: ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమాకి వచ్చే లాభాల గురించి, ఆ సమయంలో మాత్రమే మాట్లాడుకుంటారు. అదే అవార్డులు వస్తే ఎప్పుడూ మాట్లాడుకుంటారు. ఇక, ఒకే వ్యక్తికి వరుసగా అవార్డులు వస్తే ఓ సంచలనం అవుతుంది. అలా, అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు సంచలనం సృష్టించాడు. ఆయన హీరోగా నటించిన తండేల్ సినిమాకి చైతూ 3 అవార్డులు అందుకున్నాడు. తాజాగా, 3వ అవార్డ్ అందుకోవడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. ఇందులో, చైతూ రాజు పాత్రలో ఒదిగిపోయాడు. బుజ్జితల్లి పాత్రలో సాయి పల్లవి కంటతడి పెట్టించింది. అయితే, టాలీవుడ్ లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ, సాయి పల్లవి కంటే నాగ చైతన్యకి తండేల్ సినిమాతో మూడు అవార్డులు దక్కడం విశేషం.

ఈ ఏడాది ముందుగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నాగ చైతన్యకి ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కింది. ఆ తర్వాత INCA అవార్డ్స్‌లోనూ ఇదే విభాగంలో రెండవసారి అవార్డ్‌ను అందుకున్నారు. ఇక, తాజాగా సైమా(SIIMA) అవార్డ్స్‌లో బెస్ట్‌ యాక్టర్‌ గా పురస్కారాన్ని అందుకోవడం విశేషం. దీంతో ఈ ఏడాది ‘తండేల్‌’కు సంబంధించి చైతూ అకౌంట్ లో మూడవ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు చేరింది. ఇలా, ఒకే ఏడాది ఒకే నటుడికి ఒకే విభాగంలో మూడు అవార్డులు దక్కడం చాలా అరుదుగా జరిగే ఒక గొప్ప విషయం.

ఇక, చైతూ కొత్త సినిమా విషయాలకొస్తే..ప్రస్తుతం వృష కర్మ అనే సినిమాను చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 4న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దీని, తర్వాత ధూత సిరీస్‌లో నెక్స్ట్ భాగంలో నటించనున్నాడు. సమాంతరంగా కూడా కొన్నిరోజులు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

#Naga Chaithanya#Tandel#Sai Pallavi#Chandu Mondeti
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి