సినిమా

Eesha Rebba-Tarun Bhaskar: వినాయకుడి సాక్షిగా పెళ్లెప్పుడూ..అని అడుగుతున్నారు!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Eesha Rebba-Tarun Bhaskar: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఎక్కడో చోట కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న జంట హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో కం డైరెక్టర్ తరుణ్ భాస్కర్. వీరి మధ్య ఏదో ఉంది..అంటూ అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు, కూడా ఇలాగే వినాయకుడి సాక్షిగా ఈషా-తరుణ్ కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో, త్వరలో వీరు కూడా పెళ్లి వార్త ప్రకటిస్తారని కామెంట్స్ చేస్తున్నారు.

ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ఇద్దరిది వరంగల్. ఆ రకంగా పలుమార్లు వీరు కలిసి కనిపించారు. ఏయిర్‌పోర్ట్‌లో కూడా కెమెరాలకి చిక్కారు. ఇక, ఈ జంట కలిసి నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే సందేహాలనే రగిలించింది. ఇందులో, ఇద్దరూ భార్యభర్తలుగా నటించారు. ఆ సమయంలో నిర్వహించిన ప్రమోషన్స్‌లోనూ మీడియా అడిగిన ప్రశ్నలను దాటేశారు.

ఒకవైపు సినిమా ఈవెంట్స్ సమయంలో తప్పించుకున్నా..షాపింగ్ మాల్స్‌లో కనిపించి దొరికారు. అప్పుడు, కూడా అనుకోకుండా కలిసినట్టుగానే కలరింగ్ ఇచ్చారు. కానీ, వినాయక చవితి పండుగ సందర్భంగా ఒకేచోట ఈషా, తరుణ్ కలిసి పూజా చేసి అనంతరం తీసుకున్న పిక్ ని తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కానీ, ఈ పోస్ట్ కి ఇద్దరూ చిన్న కామెంట్ కూడా ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యకరం.

కానీ, హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్‌ మాత్రం చక్కటి కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘ఈ ఫొటోలో పండగ రోజు మంచి పులిహోర తిన్న ఫీల్‌ ఉంది’..అంటూ కావ్య పెట్టిన కామెంట్‌తో వీరిద్దరు త్వరలోనే పెళ్లి కబురు చెప్పబోతున్నారని అర్థమవుతోంది. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయని తప్పించుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ వినాయకచవితి నాడు మాత్రం దొరికిపోయారని అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

#Tollywood#Eesha Rebba#Tarun Bhaskar#Kavya KalyanRam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి