తెలంగాణ

Khairatabad Ganapati: ఖైరతాబాద్‌లో భక్తజన సంద్రం.. 75 వేల మందికిపైగా గణపయ్య దర్శనం!

రచన: Mahesh3 నిమిషాల పఠనం

వినాయక చవితి పర్వదినం వేళ భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

Khairatabad Ganapati: వినాయక చవితి పర్వదినం వేళ భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 6 గంటల సమయానికే రికార్డు స్థాయిలో ఏకంగా 75 వేల మందికి పైగా భక్తులు శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

గవర్నర్ దంపతుల తొలి పూజ.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు

ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ దంపతులు స్వామివారికి శాస్త్రోక్తంగా తొలి పూజ నిర్వహించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాగణపతికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు, పటిష్ట ఏర్పాట్లు చేశారు.

తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు

మహాగణపతిని దర్శించుకునేందుకు పలువురు రాజకీయ నేతలు తరలివచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు ఖైరతాబాద్ మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 25న మహా నిమజ్జన ఘట్టం జరగనుంది. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

#Khairatabad Ganapati#Khairatabad Ganesh#Khairatabad Ganesh Utsav#Hyderabad Ganesh Festival#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి