సినిమా

The Paradise: కయాదు లోహర్‌ని ఎందుకు దాచేసున్నారు..ఇది మైనస్ అవుతుందేమో?

రచన: Anshu4 నిమిషాల పఠనం

The Paradise: నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో 7 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఎలాంటి, భారీ స్థాయి ప్రమోషన్స్ లేకపోయినా సినిమాపై మాత్రం అందరిలో మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. అంతేకాదు, ఇప్పటికే యూఎస్ లో రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ సేల్ అయ్యాయి. అయితే, అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ కయాదు లోహర్ హీరోయిన్ అని ఎస్టాబ్లిష్ చేయకపోవడమే.

నిన్నామొన్నా స్పెషల్ నంబర్‌లో ఆడిపాడిన కీర్తి సురేష్ కి బాగా హైప్ వచ్చింది. నాని, కీర్తి కలిసి చేసిన ఏషనాగుల సాంగ్‌కి యూట్యూబ్ మొత్తం షేక్ అయింది. అంతగా, ఈ పాటకి క్రేజ్ వచ్చింది. ఎప్పుడెప్పుడు థియోటర్స్‌లో ఈ పాట చూద్దామా..మాస్ స్టెప్పులతో రచ్చ చేద్దామా..అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ నాని-కీర్తి కలిసి దసరా సినిమాలో జంటగా నటించారు కాబట్టి, ఇదే జంటపై అందరికి ఆసక్తి ఉంది.

అలాంటి, ఆసక్తి మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మేయిన్ హీరోయిన్ అయిన కయాదు లోహర్ మీద కలిగించలేదు. టీజర్‌లో ఈ బ్యూటీ కనిపించింది ఒక్క సెకండ్ మాత్రమే. అది తప్ప సినిమాలో ఆమె పాత్ర ఏంటీ..స్క్రీన్ స్పేష్ ఎంతవరకూ ఉంటుంది..నాని-కయాదు ల మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి..ఇలాంటివన్నీ కూడా ఇప్పటివరకూ ఎలాంటి క్లూ లేకుండా ఉన్నాయి. ఇంతకముందు, ఇలా హీరోయిన్‌ని ఎక్కువగా చూపించకపోవడంతో ఫ్లాపైన సినిమాలు చాలానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డం సినిమాలోనూ భాగ్యశ్రీ కనిపించేది కొన్ని నిముషాలే.

అప్పట్లో, అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలోనూ హీరోయిన్‌ని ఇంట్రవెల్ వరకూ చూపించలేదు. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. మరి, ప్యారడైజ్ మూవీలో అలాంటి పొరపాటే చేస్తున్నారా? లేదంటే కయాదు పాత్ర సినిమాలో కథను మలుపు తిప్పేంత గొప్పగా ఉంటుందా? అనేది అర్థం కావడం లేదు. అసలే, ఒకే నెలలో మూడు సినిమాలతో వచ్చింది కయాదు. కానీ, ఆమెకి మాత్రం భారీ హిట్ ఒక్కటీ దక్కలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ నాని ప్యారడైజ్ సినిమాపైనే పెట్టుకుంది. చూడాలి, మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

#kayadu lohar#nani#srikanth odela#the paradise
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి