స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

22 A చర్చ సాగేనా ముఖ్యమంత్రివర్యా ? క్లారిఫికేషన్స్ లేకుండానే ఖతం పట్టిస్తారా ?

రచన: Venu6 నిమిషాల పఠనం

ఆనాడు ధరణితో 10 లక్షల కోట్ల భూ కుంభకోణం అని మీరే అన్నారు. సీఎం అయ్యాక దోచుకుంటూ ఎంత పంచుకుంటున్నారో సభలో చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ సబెక్ట్ పై మంత్రి 4 గంటలు మాట్లాడి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో చర్చించారు.

ధరణి మాటున భూ భారతి పేరుతో దోచుకుంటూ, పంచుకునేది ఏంటో మీరు చెబుతారా?

కూకట్‌పల్లిలోని 333 ఎకరాల ఐడీఎల్ భూముల్లో మీ సమాధానం ఉంటుందా?

ఖాజాగూడలో వంశీరాం 25 ఎకరాలపై సొంత ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసు గురించి వివరిస్తారా?

సాస్ ఇన్‌ఫ్రా 600 కోట్ల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారో చెప్పగలరా?

నాగారంలో IAS, IPS లను కోర్టుకు లాగిన EIPL భూదాన్ భూములను స్వాధీనం చేసుకుంటారా?

గచ్చిబౌలిలో అక్రమంగా అరబిందో పట్టా పాస్‌బుక్‌లు ఇస్తే సుప్రీంకోర్టు స్టేతో ఆగిన వ్యవహారంపై సమాధానం ఇస్తారా?

ఖానామెట్‌లో జీరో అనుమతితో వేల అపార్ట్‌మెంట్స్ అన్ రిజిస్ట్రర్

దోపిడీతనానికి 22A ఎందుకు అడ్డు రావడం లేదు!!..

ఇక్కడే దగ్గుపాటి ఫ్యామిలీ, అపర్ణతో కలిసి చేస్తున్న సర్వేలపై స్పందిస్తారా?

నాదర్‌గుల్‌లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ కబ్జాలపై లింకులు బయటపెడతారా?

వాసవి అనంద్ నిలయంలో అసైన్డ్ భూముల్లో అనుమతులు ఏంటో మాట్లాడతారా?

పుప్పాలగూడ భూముల్లో ఓ ఎమ్మెల్యేకే దొంగ పాస్‌బుక్స్‌పై నమోదైన కేసు ఎక్కడివరకు వచ్చిందో బ్రీఫ్ ఇస్తారా?

కీసరలోని కీలక భూములపై అప్‌డేట్స్ మీకు తెలుసా?

వేల కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసే కుట్రలో..?

కోర్టులో ప్రభుత్వం తరపున కౌంటర్ వేయని కేసులు ఏంటో మీరు ఇస్తారా?

స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఇవ్వాలా?

భావితరాలకు ప్రభుత్వ భూమి లేకుండా చేస్తున్న మీ మాఫియాతో

పాలుపంచుకుంటున్న అధికారులు, ప్రభుత్వ అడ్వకేట్స్

చరిత్రలో హీనులుగా, మోసగాళ్లుగా మిగిలిపోతారు.

సిట్టింగ్ జడ్జితోనా? రిటైర్డ్ హైకోర్టు జడ్జితోనా లేక కమిషన్‌తోనా..

దర్యాప్తుకు అదేశించండి..?

20 ఏళ్లుగా కొనసాగిస్తున్న లోపాయికారి భూదందాలపై

పిన్ టు పిన్ ఎవిడెన్స్ ఇచ్చేందుకు స్వేచ్ఛ న్యూస్ సిద్ధం.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

లక్ష కోట్ల స్కామ్ అంటూ ప్రచారం చేసి 7 వేల కోట్ల పనులపై కాళేశ్వర కమిషన్ వేశారు. సీబీఐకి లేఖలో ఏం ఉందో మీకు తెలుసు? ఆనాడు ధరణితో 10 లక్షల కోట్ల భూ కుంభకోణం అని మీరే అన్నారు. సీఎం అయ్యాక దోచుకుంటూ ఎంత పంచుకుంటున్నారో సభలో చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ సబెక్ట్ పై మంత్రి 4 గంటలు మాట్లాడి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో చర్చించారు.

మీ డబ్బా కొట్టే ఎంఐఎం, సీపీఐ వ్యాఖ్యలు ఉంటాయి. కానీ సింగిల్‌గా ఉండే ఏలేటి ఎంతో ప్రిపేర్ అయ్యి వస్తే, ఆధారాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే, నిమిష నిమిషానికి మంత్రులు మైకు తీసుకున్నారు. ఆరుగురు మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం, వాకాటి, లక్ష్మణ్ అడ్డు తగిలారు. ఆ తర్వాత ముగ్గురు విప్‌లు కూడా మాట్లాడారు. ముప్పేట దాడితో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి.

దీనిపై ముగింపు ఇవ్వకుండానే బీజేపీ ఎల్పీ లీడర్ మాట్లాడుతుండగానే మంగళవారానికి అడ్జెన్ అయింది. అయితే ఈ సభలో ఎంతో దుమారం లేసిన 22A పై చర్చ కొనసాగుతుందా? లేక మంత్రి ఆ 4 గంటల్లోనే చెప్పేశారు ఇక మీకు చెప్పేది ఏమీ లేదని వదిలేస్తారా? ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన ముఖ్యమంత్రి భూములపై చర్చను సవాల్‌గా తీసుకుని అన్నింటికి సమాధానం చెబుతూ కమిషన్ లేదా దర్యాప్తునకు అదేశిస్తారా?

ఆనాటి బీఆర్ఎస్ తీరులానే కనీసం CAG కి ఇవ్వకుండానే దొంగ పాస్ వర్డ్స్, హ్యాకింగ్ అంటూ ఆడుతున్న నాటకాలకు సమాధానం చెబతారా? NIC కి మెయింటెనెన్స్ ఇచ్చారు. వారికి తెలియకుండా చేస్తున్న దందాలు ఏంటో సభలో వివరిస్తారా? లేదంటే మీరు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేస్తున్న లాభాలు, వారి వద్ద నుంచి దోచుకుంటున్న వ్యవహారాలు, మీ మంత్రుల బినామీ దందాలు, షెల్ కంపెనీ వ్యవహారాలు, అన్నింటికి అధారాలతో సహా స్వేచ్ఛ న్యూస్ వెంటాడుతూ ఉంటుంది. అసెంబ్లీలో తప్పించుకుని జబ్బలు చరుచుకుంటూ మీరు ఉండండి. అధారాలతో సోషల్ మీడియాకు ఉప్పు అందించి ఉప్పెనలా ఉద్యమం ఉంటుంది.

#Telangana#Hyderabad#22 A#Chief Minister#clarifications#cbi#dharani#bhubarathi#Eleti#Ponguleti#Sridhar Babu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి