ఏపీ

AP : బస్సులో భారీగా పేలుడు పదార్థాలు.. తప్పిన పెనుప్రమాదం!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఏపీలో పెనుప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడ పట్టణంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

ఏపీలో పెనుప్రమాదం తప్పింది. గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటన విజయవాడ పట్టణంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే, బస్సులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును గుర్తించిన సదరు ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

బస్సు సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిసింది.దీంతో బస్సు డ్రైవర్ బస్సును రద్దీలేని ప్రదేశంలో నిలపగా.. కృష్ణలంక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం బస్సులోని అనుమానాస్పద బ్యాగును గుర్తించి తనిఖీలు చేపట్టారు. అందులో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు.

బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దించేశారు. బస్సు లోపల, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు అమర్చి కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను బస్సులోకి ఎవరు తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆర్టీసీ బస్టాండ్, బస్సు తిరిగిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా సదరు బస్సులో ప్రయాణించిన వారి వివరాలపైనా ఆరా తీస్తున్నారు. సమయానికి సమాచారం అందించిన ప్రయాణికుడిని పోలీసులు అభినందించారు.ముందుగా పేలుడు పదార్థాలను సేఫ్టీ జోన్‌కు తరలించినట్టు తెలిసింది. ఈ విషయం తెలియడంతో ప్రయాణికులు ఒకింత షాక్‌కు గురవ్వగా..అనంతరం ఊపిరి పీల్చుకున్నట్టు సమాచారం.

#blast items#jeletin stics#detonators#vijayawada#andrapradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి