Official: భారతీయ సినిమా దిగ్గజ గాయనీ, లెజెండరీ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి ఎలాంటి అద్భుతమైన పాటలను పాడారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఆమె పాటలకి అభిమానులున్నారు. అంతేకాదు, ఈ జనరేషన్‌లో ఎం ఎస్ సుబ్బలక్ష్మి పాటలను వింటూ మైమరిచే ప్రేక్షకులున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఎం ఎస్ సుబ్బలక్ష్మి గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించబోతోంది.
మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోనూ పలువురి జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. స్పోర్ట్స్, సినిమా, రాజకీయా నాయకులకి సంబందించిన బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ఎం ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై కూడా సినిమా రూపొందనుంది. గతకొంతకాలంగా ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ఉంటుంది అని వార్తలు వచ్చాయి.
కానీ, ఆ పాత్రకి తగ్గ నటీమణి ఎవరున్నారు..అని రక రకాల చర్చలు సాగాయి. ఒకదశలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎం ఎస్ సుబ్బలక్ష్మి గా నటించబోతోందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అధికారికంగా రష్మిక మందన్న కన్‌ఫర్మ్ అయింది. ప్రస్తుతం, రష్మిక మందన్న మైసా, రణబాలి చిత్రాలలో నటిస్తోంది. ఇటీవలే, రణబాలి షూటింగ్ కంప్లీట్ చేసింది.
ఇక, సెప్టెంబర్ 16 ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి. ఈ సందర్భంగా చెన్నైలో ఈ సినిమాను ఘనంగా ప్రారంభించబోతున్నారు. అంతేకాదు, ఈ కార్యక్రమానికి యూనివర్సల్ స్టార్ హీరో, ఉలగనయగన్ కమల్ హాసన్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. ఆయనతో పాటుగా మరికొంతమంది గాయనీ గాయకులు కూడా హాజరు కానున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.








