రాష్ట్రంలో ప్రస్తుతం 22 ఏ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ వైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు, మరోవైపు సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏం చేయాలో తోచక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయం ఉందనుకుంటే ఇప్పటినుంచే జనాల తిరగబడేలా ఉన్నారని హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. కానీ, అనవసరంగా ప్రజల భూములు, ఆస్తుల జోలికి వెళ్లాం కదా? అని ఇప్పుడెలా? అని అధికార పార్టీ నేతలే చర్చించుకుంటున్నట్టు సమాచారం.
ఇలాగే పరిస్థితులు ఉంటే వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బతగలడం ఖాయమని జోరుగా ప్రచారం నడుస్తోంది. 22ఏ అంశానికి త్వరగా పరిష్కారం చూపాలని కిందిస్థాయి నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. లేదంటే తాము క్షేత్రస్థాయిలో తిరగలేమని, బీఆర్ఎస్ నేతల విమర్శలు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని హస్తం పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోన నేడు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. 22ఏ అంశం మీద మంత్రులకు అవగాహన కల్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలో వారికి మార్గదర్శనం చేస్తారని తెలుస్తోంది. కాగా, గతంలో ‘ధరణి’పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు దోచుకుందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక భూ భారతిని తెచ్చి అదే పనిచేస్తున్నద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రజల తరఫున‘స్వేచ్ఛ న్యూస్’ డిమాండ్ చేస్తోంది.
*ధరణి మాటున భూ భారతి పేరుతో దొచుకుంటూ, పంచుకునేది ఎంటో మీరు చెప్పుతారా?
*కూకట్ పల్లిలోని 333 ఎకరాల ఐడిఎల్ భూములపై మీ దగ్గర సమాధానం ఉందా?
*ఖాజాగూడలో వంశీరాం 25 ఎకరాలపై సొంత ఎమ్మెల్యేలు హైకోర్టులో వేసిన కేసు గురించి వివరిస్తారా?
*సాస్ ఇన్ఫ్రా రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారో చెప్పగలరా?
*నాగారంలో IAS, IPSలను కోర్టుకు లాగీన EIPL భూదాన్ భూములను స్వాధీనం చేసుకుంటారా?
*గచ్చిబౌలిలో అక్రమంగా అరబిందో కోసం మంత్రి పట్టా పాస్‌బుక్‌లు ఇప్పిస్తే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆగిన వ్యవహారంపైనా సమాధానం ఇస్తారా?
*ఖానామేట్‌లో జీరో అనుమతితో వేల అపార్మెంట్స్ అన్ రిజిస్ట్రర్ దోపిడీతనానికి 22A ఎందుకు అడ్డురావడం లేదు
*ఇక్కడే దగ్గుపాటి ఫ్యామిలీ, అపర్ణతో కలిసి చేస్తున్న సర్వేలపై స్పందిస్తారా?
*కొండకల్‌లో ఊరంతా కబ్జాపై ఊసు ఎత్తుతారా!
*నాదర్ గుల్‌లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రయివేట్ కబ్జాలపై లింకులు భయటపెడుతారా?
*వాసవి అనంద్ నిలయంలో అసైన్డ్ భూముల్లో అనుమతులు ఎంటో మాట్లాడుతారా?
*పుప్పాల గూడ భూముల్లో ఓ ఎమ్మెల్యేకే దొంగ పాసుబుక్స్‌పై నమోదైన కేసు ఎక్కడి వరకు వచ్చిందో బ్రీఫ్ ఇస్తారా?
*కీసరలోని కీలక భూములపై అప్డెట్స్ మీకు తెలుసా?
*రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసే కుట్రలో.. కోర్టులో ప్రభుత్వం తరుపున కౌంటర్ వేయని కేసులు ఎంటో మీరు ఎప్పుడైనా అడిగారా?
*భావితరాలకు ప్రభుత్వ భూమి లేకుండా చేస్తున్న మీ రెవెన్యూ మాఫియాతో పాలుపంచుకుంటున్న అధికారులు, ప్రభుత్వ అడ్వకేట్స్
చరిత్రలో హీనులుగా, మోసగాళ్లుగా మిగిలిపోతారని హెచ్చరిస్తారా?
*భూములపై చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జి.. రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తారా?
*శ్వేత పత్రం విడుదల చేసి దర్యాప్తునకు ఆదేశిస్తారా? లేదా?
20 ఏండ్లుగా కొనసాగిస్తున్న లోపాయికారి భూ దందాలపై ‘పిన్ టూ పిన్ ఎవిడెన్స్’ ఇచ్చేందుకు ‘స్వేచ్ఛ న్యూస్’ సిద్దం..
✍️ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్
9848070809
https://x.com/CDevenderReddy/status/2099720580123783204?s=20







