స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangnana: 22 A చర్చ సాగేనా ముఖ్యమంత్రివర్యా ? క్లారిఫికేషన్స్ లేకుండానే ఖతం పట్టిస్తారా ?

రచన: Venu6 నిమిషాల పఠనం

ఆనాడు ధరణితో 10 లక్షల కోట్ల భూ కుంభకోణం అని మీరే అన్నారు. సీఎం అయ్యకా దొచుకుంటూ ఎంత పంచుకుంటున్నారో సభలో చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓ సబెక్ట్ పై మంత్రి 4 గంటలు మాట్లాడి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో చర్చించారు.

ధరణి మాటున భూ భారతి పేరుతో దొచుకుంటూ,

పంచుకునేది ఎంటో మీరు చెప్పుతారా ?

కూకట్ పల్లి లోని 333 ఎకరాల ఐడిఎల్ భూముల్లో మీ సమాధానం ఉంటుందా ?

ఖాజాగూడలో వంశీరాం 25 ఎకరాల పై సొంత ఎమ్మెల్యేలు హై కోర్టులో కేసు గురించి వివరిస్తారా ?

సాస్ ఇన్ఫ్రా 600 కోట్ల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారో చెప్పగలరా ?

నాగారంలో IAS, IPS లను కోర్టుకు లాగీన EIPL భూదాన్ భూములను స్వాధీనం చేసుకుంటారా ?

గచ్చిబౌలిలో అక్రమంగా అరబిందో పట్ట పాస్ బుక్ లు ఇస్తే సుప్రీంకోర్టు స్టేతో

ఆగిన వ్యవహారం పై సమాధానం ఇస్తారా ?

ఖానామేట్ లో జీరో అనుమతితో వేల అపార్మెంట్స్ అన్ రిజిస్ట్రర్

దొపిడితనానికి 22 A ఎందుకు అడ్డురావడం లేదు!!..

ఇక్కడే దగ్గుపాటి ఫ్యామిలీ, అపర్ణ తో కలిసి చేస్తున్న సర్వేల పై స్పందిస్తారా ?

నాదర్ గుల్ లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రయివేట్ కబ్జాల పై లింకులు భయటపెడుతారా ?

వాసవి అనంద్ నిలయంలో అసైన్డ్ భూముల్లో అనమతులు ఎంటో మాట్లాడుతారా ?

పుప్పాల గూఢ భూముల్లో ఓ ఎమ్మల్యే కే దొంగ పాసుబుక్స్ పై నమోదైన

కేసు ఎక్కడి వరకు వచ్చిందో బ్రీప్ ఇస్తారా ?

కీసరలోని కీలక భూముల పై అప్డెట్స్ మీకు తెలుసా ?

వేల కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసే కుట్రలో ..?

కోర్టులో ప్రభుత్వం తరుపున కౌంటర్ వేయని కేసులు ఎంటో మీరు ఇస్తారా?

స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి ఇవ్వాలా?

భావితరాలకు ప్రభుత్వ భూమి లేకుండా చేస్తున్న మీ మాఫియాతో

పాలుపంచుకుంటున్న అధికారులు, ప్రభుత్వ అడ్వకేట్స్

చరిత్ర లో హీనులుగా, మోసగాళ్లుగా మిగిలిపోతారు.

సిట్టింగ్ జడ్జితోనా ? రిటైర్డ్ హైకోర్టు జడ్జితోనా లేక కమిషన్తోనా..

దర్యాప్తుకు అదేశించండి..?

20 ఏండ్లుగా కొనసాగిస్తున్న లోపాయికారి భూ దందాల పై

పిన్ టూ పిన్ ఎవిడెన్స్ ఇచ్చేందుకు స్వేచ్ఛ న్యూస్ సిద్దం .

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

9848070809

లక్షకోట్ల స్కాం అంటూ ప్రచారం చేసి 7 వేల కోట్ల పనుల పై కాళేశ్వర కమిషన్ వేశారు. సిబిఐకి లేఖలో ఏం ఉందో మీకు తెలుసు ? ఆనాడు ధరణితో 10 లక్షల కోట్ల భూ కుంభకోణం అని మీరే అన్నారు. సీఎం అయ్యకా దొచుకుంటూ ఎంత పంచుకుంటున్నారో సభలో చెప్పాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓ సబెక్ట్ పై మంత్రి 4 గంటలు మాట్లాడి ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం లేని సమయంలో చర్చించారు.

మీ డబ్బా కొట్టే ఎంఐఎం, సీపీఐ వాఖ్యాలు ఉంటాయి. కాని సింగిల్ గా ఉండే ఎలేటీ ఎంతో ప్రిపేర్ అయ్యి వస్తే ? ఆధారాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నిమిషా నిమిషానికి మంత్రులు మైకు తీసుకున్నారు. 6 గురు మంత్రులు అయినా భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం, వాకాటి, లక్ష్మణ్ లు అడ్డుతగిలారు. ఆ తర్వాత 3గురు విప్ లు కూడా మాట్లాడారు. ముప్పేట దాడితో ఎవ్వరు ఎం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి.

దీని పై ముగింపు ఇవ్వకుండానే బిజెపి ఎల్పీ లీడర్ మాట్లాడుతుండగానే మంగళవారానికి అడ్జెన్ అయింది. అయితే ఈ సభలో ఎంతో దుమారం లేసిన 22A పై చర్చ కొనసాగుతుందా ? మంత్రి ఆ 4 గంటల్లోనే చెప్పారు. మీకు చెప్పేంది ఏమి లేదని వదిలేస్తారా ? ఒక అప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన ముఖ్యమంత్రి భూముల పై చర్చను సవాలుగా తీసుకుని అన్ని సమాధానం చెప్పుతూ, కమిషన్ లేదా దర్యాప్తుకు అదేశిస్తారా ?

ఆనాటి బీఆర్ఎస్ తీరులానే కనీసం CAG కి ఇవ్వకుండానే దొంగ పాస్ వార్డ్స్ , హాకింగ్ అంటూ ఆడుతున్న నాటకాలకు సమాధానం చెప్పుతారా ? NIC కి మెంటనెన్స్ ఇచ్చారు. వారికి తెలియకుండా చేస్తున్న దందాలు ఎంటో సభలో వివరిస్తారా ? లేదంటే మీరు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపనీలకు చేస్తున్న లాభాలు, వారి వద్ద నుంచి దొచుకుంటున్న వ్యవహారాలు, మీ మంత్రుల బినామి దందాలు, షెల్ కంపనీ వ్యవహారలు, అన్నింటికి అధారాలతో సహా స్వేచ్ఛ న్యూస్ వేంటాడుతూ ఉంటుంది. అసెంబ్లీలో తప్పించుకుని జబ్బలు తరుముకుంటు మీరు ఉండండి . అధారాలతో సహా సోషల్ మీడియాకు ఉప్పు అందించి ఉప్పెనలా ఉద్యమం ఉంటుంది.

#Telangana#Hyderabad#22 A#Chief Minister#clarifications#cbi#dharani#bhubarathi#Eleti#Ponguleti#Sridhar Babu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి