Ramayana: బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న డివోషనల్ మూవీ ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో, రాముడిగా రణబీర్ కపూర్, టాలీవుడ్ హీరోయిన్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు వినాయక చవితి. ఈ సందర్భంగా మేకర్స్ రామాయణ మూవీ నుంచి సీతా-రాముల పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం, ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక, ఈ సినిమాలో విలక్షణ నటుడు యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన వాళ్ళలో కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా, పురాణ కథలను తెరకెక్కించినప్పుడు పాత్రలు, ఆ కాస్ట్యూంస్ సహా లొకేషన్స్ విషయంలోనూ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విషయంలోనే..రామాయణ చిత్ర దర్శక నిర్మాతలు విమర్శలకి గురైయ్యారు. అయినా, కూడా ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది దీపావళి పండుగకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా సీతారాములు ఏకాంతంగా ఉన్నట్లుగా రూపొందించిన మొదటి పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే, ఈ 30 సెకన్ల వీడియో ఒక చిన్న ట్రీట్ మాత్రమేనని.. సినిమాలో విజువల్స్ ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ తెలిపారు.
ఎంత నెగిటివీ క్రియేట్ చేసినా కూడా ప్రేక్షకులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ సిరీస్ మీదే ఉంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. అంతేకాదు, సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియాతో పాటు.. విదేశాల్లో రామాయణ షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ మూవీలో హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. వీరితో పాటు కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది.









