అమెరికాలోని మెడికేర్ స్కీంలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని తాజాగా కనిపెట్టగా యూఎస్ సర్కారు నుంచి భారీగా నిధులు దోచేసిన మాస్టర్‌మైండ్ ఓ భారతీయుడిగా అనుమానిస్తున్నారు. నకిలీ బిల్లులు సమర్పించి భారతీయ కరెన్సీలో రూ.వందల కోట్లు స్కామ్ చేసినట్టు సమాచారం. విషయం బయటకు రాకముందే అమెరికా విడిచి ఇండియాకు పారిపోయి వచ్చినట్టు అక్కడి నిఘావర్గాలు గుర్తించినట్టు సమాచారం.
అమెరికాలో మెడికేర్ స్కీం ద్వారా అక్కడి పౌరులకు ఉచితంగా వైద్యం అందుతుంటుంది. ఆస్పత్రులకు యూఎస్ గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తుంటుంది.అయితే, రోగులు రాకుండానే, ట్రీట్మెంట్ చేయకుండానే చేసినట్టు నకిలీ బిల్లులు సమర్పించి రూ. వందల కోట్లు కాజేయగా.. దీని వెనుక ఆస్ప్రత్రుల హస్తం ఉందా? అనే కోణంలోనూ అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్‌లో అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్ నిర్వహించిన మహ్మద్ ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి ఈ స్కాంలో సూత్రధారుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. నకిలీ మెడికల్ క్లెయిమ్స్‌తో మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల సంతకాలు, వివరాలు ఫోర్జరీ చేసినట్లు అతడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా నుంచి పరారైన ఖాదీర్‌ఖాన్ హైదరాబాద్‌లో ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

అమెరికాలో ఖాదీర్ ఖాన్ చేసిన ‘మెడికేర్’ స్కామ్ విలువ ఏకంగా రూ.620 కోట్లు (65 మిలియన్ డాలర్లు)గా తేలింది. డాక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ బిల్లులు సమర్పించి భారీ మొత్తంలో నిధులు క్లెయిమ్ చేసినట్టు పోలీసుల నిర్దారణకు వచ్చినట్టు తెలిసింది.
https://x.com/pulsenewsbreak/status/2099390691222921256?s=20
దీంతో టెక్సాస్ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఖదీర్‌ఖాన్ పేరును చేర్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు ద్వారా హైదరాబాద్ చేరిన వారి వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నట్టు తెలిసింది. యూఎస్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇక్కడి పోలీసుల సాయంతో నిందితుడికి పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు చర్యలు చేపట్టాయి.










