Nayanthara: సీనియర్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. హీరోయిన్‌గా పక్కా కమర్షియల్ సినిమాలను స్టార్ హీరోల సరసన నటిస్తూనే డివోషనల్ మూవీస్‌లోనూ అమ్మవారి పాత్రల్లో నటించి అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, నయనతార నటిస్తున్న లేటెస్ట్ సినిమా ముకుత్తి అమ్మన్ 2 చేస్తున్నారు. తెలుగులో, ఈ సినిమా మహాశక్తిగా విడుదల కాబోతోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజైంది.
మూకుత్తి అమ్మన్ చిత్రాన్ని ఆర్.జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, మళ్ళీ ఇన్నేళ్ళకి మూకుత్తి అమ్మన్ కి సీక్వెల్ రూపొందుతోంది. సుందర్ సి. దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి భాగానికంటే అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందుతోందట.
తెలుగులో, మహాశక్తిగా ఈ సినిమా విడుదల కానుండగా తాజాగా, అమ్మవారి పాత్రలో నటిస్తున్న నయనతార లుక్ రిలీజ్ చేశారు. ఇక, ఈ సినిమా నవంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే టీజర్ కూడా వదిలారు. ఈ టీజర్‌లో అమ్మవారి గెటప్‌లో నయన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. కొన్నిచోట్ల విజువల్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి.
కాగా, ఈ సినిమాలో సునీల్, రెజీనా, దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. అవని సినిమాక్స్, వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. హిప్‌హాప్ తమిళా ఆది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ ఏడాది ప్రారంభంలో నయన్ తెలుగులో మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. కమర్షియల్, డివోషనల్ చిత్రాలలో నటిస్తున్న ఈ లేడీ సూపర్ స్టార్ నిర్మాతగానూ యువ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది.











