Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషితో ఎదిగిన మరో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మాస్ మహారాజ్ రవితేజ అని ఠక్కున ఎవరైనా చెప్పేస్తారు. వరుస ఫ్లాప్స్ వచ్చినా ఇంచు కూడా వణకని రవితేజ..అదే జోరులో కొత్త సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసినన్ని సినిమాలు ఇంకో చేయలేదనే చెప్పాలి.
ఇటీవల ఇరుముడి సినిమాతో వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసిన హీరో మన మాస్ మహారాజ్. దీనికి ముందు వరకూ ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. వాస్తవానికి, ఇరుముడి సినిమా తర్వాత ఏంటి పరిస్థితి అని చాలామంది రవితేజ గురించి మాట్లాడుకున్నారు. దీనికి కారణం..శివ నిర్వాణతో రవితేజ సినిమా అంటే చాలామందికి కొంత సందేహాలు మొదలవడమే. ఈ కాంబినేషన్ ఊహించుకోలేదు.
కానీ, ఇదే కాంబినేషన్ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ భారీ విజయాన్ని ఏ ఒక్కరూ ఊహించలేదు. అయితే, ఇలాంటి సక్సెస్‌లు రవితేజకి గతంలోనూ వచ్చాయి. రిస్క్ చేయలన్నా..కెరీర్ ప్రారంభంలో ఉన్న దర్శకులకి ఛాన్స్ ఇవ్వాలన్నా రవితేజ ముదుంటాడు. రవితేజతో హిట్ కొడితే ఇక నెస్క్ట్ లెవలే అని దర్శకులకి భారీ నమ్మకాలు కలిగాయి..అలాగే, తర్వాత బిగ్ స్టార్స్‌తోనూ సినిమాలు చేసే ఛాన్స్ అందుకున్నారు.
గోపీచంద్ మలినేని రవితేజతో డాన్ శీను, బలుపు లాంటి సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత క్రాక్ సినిమా. అయితే, బాలకృష్ణని డైరెక్ట్ చేసే ఛాన్స్ రవితేజ సక్సెస్‌ల తర్వాతే గోపీకి దక్కాయి. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ అనే సినిమాను రవితేజతో తీసి హిట్ కొట్టాక..వెంకటేష్ తో సినిమాలు చేస్తూ వచ్చాడు.
అలాగే, బాలయ్య, చిరంజీవిలతోనూ అవకాశాలను అందుకున్నాడు. బాబీ కూడా కెరీర్ ప్రారంభంలో పవర్ అనే హిట్ సినిమాను రవితేజతో తీశాకే ఎన్‌టిర్, చిరంజీవి, బాలకృష్ణలతో ఛాన్స్ అందుకున్నాడు. సో మన దర్శకుల్లో చాలామంది రవితేజతో హిట్ కొట్టి ఆ తర్వాత టాప్ హీరోల నుంచి అవకాశాలను అందుకున్నారు. ఈ క్రెడిట్ అంతా మన మాస్ మహారాజ్‌కే దక్కుతుంది.








