Supreme Court: సికింద్రాబాద్ శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ల్యాండ్ కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంట్మోనెంట్‌లో 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పుపై సకాలంలో సవాల్ చేయలేదన్న సుప్రీంకోర్టు.. ఆలస్యంగా దాఖలు చేశారని పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. వివాదాస్పద 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 219 రోజుల ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారనే కారణంతో పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీం ధర్మాసనం. కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌దేనన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది ప్రభుత్వ భూమి అంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ సకాలంలో స్పందించలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోలేము అని తేల్చి చెప్పింది. ఆ భూమి శాంతా శ్రీరామ్ కన్స్‌స్ట్రక్షన్స్‌దేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు నిరాకరించింది.
లోతుకుంటలోని 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్‌దేనని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే సవాల్ చేయకుండా చాలా ఆలస్యంగా రేవంత్ సర్కార్ పిటిషన్ వేసిందని ధర్మాసనం చెప్పింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తగిన సమయంలో సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఆ సమయాన్ని మించిన తర్వాత 219 రోజుల ఆలస్యంగా రావడంతో ఆ పిటిషన్‌పై తాము విచారణ చేపట్టలేము అని దీపాంకర్ ధర్మాసనం తేల్చి చెప్పింది. రేవంత్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన టైటిల్ క్లియర్‌ను సుప్రీంకోర్టు సమర్థించినట్లు అయ్యింది. సికింద్రాబాద్ లోతుకుంటలో ఉన్న 40ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్స్‌స్ట్రక్షన్స్ సంస్థకే చెందినదిగా సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్లు అయ్యింది.









