సినిమా

Mahesh Babu: రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Mahesh Babu: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో వర్క్ చేయడం చాలా కష్టమని బాహుబలి తర్వాత ప్రభాస్, రానా..ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్‌టిర్-చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. తారక్ అయితే, ఏకంగా రాక్షడు అని పేరు పెట్టాడు. కానీ, మహేష్ బాబు మాత్రం తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం.. అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనితో, వారణాసి సినిమా గురించే మహేష్ ఇలా చెప్పాడని అందరూ చెప్పుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఓ 10 శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాతలలో ఒకరైన ఎస్.ఎస్.కార్తికేయ వెల్లడించారు. ప్రస్తుతం వారణాసి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.

అలాగే, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. రాజమౌళితో వర్క్ చేయడం అంటే పెద్ద ఛాలెంజ్ అని హీరోలే కాదు, ఆయన టీమ్ లో వాళ్ళు అంటుంటారు. షూటింగ్ సమయంలో క్యారెక్టర్ కోసం ఒకలా హింస పెడితే..ప్రమోషన్స్ సమయంలో ఆ హింస ఇంకోలా ఉంటుందనే ఆయనతో వర్క్ చేసినవాళ్ళు అంటుంటారు. కానీ, వీరందరికంటే పూర్తి భిన్నంగా మహేష్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్..రోబో తర్వాత ఒక్కసారి శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేయమని చిరంజీవిని రిక్వెస్ట్ చేశాడు. ఒక్కో షాట్ కోసం శంకర్ చాలా సమయం తీసుకుంటాడు. ఇక్కడ జక్కన్న కూడా అంతే. కానీ, మహేష్ మాత్రం తాజాగా..రాజమౌళితో వర్క్ చాలా చాలా సులభం.. అని చెప్పాడు. దీన్ని బట్టి రాజమౌళి..మహేష్ ని ఏమాత్రం కష్టపెట్టకుండా వారణాసి పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

#Mahesh Babu#SS Rajamouli#Varanasi#Priyanka Chopra
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి