తెలంగాణ

Congress : కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా అరెల్లి కిరణ్ గౌడ్

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేస్తున్న తరుణంలో అధికార పార్టీ తరపున గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియా విభాగ అధిపతుల్లో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేస్తున్న తరుణంలో అధికార పార్టీ తరపున గట్టి కౌంటర్ ఇవ్వడానికి సోషల్ మీడియా విభాగ అధిపతుల్లో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అరెల్లి కిరణ్ గౌడ్‌ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా డిపార్ట్‌మెంట్ నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా సెక్రెటరీల లిస్ట్‌ను విడుదల చేసింది.అరెల్లి కిరణ్ గౌడ్.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని సూరయ్యపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత. అయితే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ సెక్రెటరీగా తన పేరును ప్రకటించడంపై అరెల్లి కిరణ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ కోసం మరింతగా కష్టపడి పనిచేస్తానని వెల్లడించారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా అరెల్లి కిరణ్ గౌడ్ ఎన్నిక కావడం పట్ల మంథని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, హామీలు అమలులో రేవంత్ సర్కార్ వైఫల్యం మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్‌‌గా పనిచేస్తున్న విషయంం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగానే ప్రజా సమస్యలపై పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తగా నియామకాలు చేపట్టినట్టు సమాచారం.

#congress#social media#state secretory#kiran goud#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి