Srikanth Odela: దసరా, ది ప్యారడైజ్ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ విషయాన్ని తాజాగా ఆయన ప్యారడైజ్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. నానీ, కయాదు లోహర్ జంటగా నటించిన ది ప్యారడైజ్ సినిమా ఈ నెల 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చరణ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి వెల్లడించడం ఆసక్తికరమైన చర్చగా మారింది.
అప్పట్లో కాస్ట్యూం డిజైనర్:
సుకుమార్, రామ్ చరణ్ కలిసి రంగస్థలం సినిమా చేసిన సంగతి తెలిసిన్దే. అప్పటి వరకూ చరణ్ పక్కా మాస్ అండ్ యాక్షన్ సినిమాలను చేశాడు. కానీ, రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేయలేదు. పైగా, వినికిడి లోపం ఉన్న పాత్ర చేయడం అంటే పెద్ద ఛాలెంజ్. ఇందులో హీరోయిన్‌గా సమంత నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
హైదరాబాద్‌లో 30 ఎకరాలలో వేసిన విలేజ్ సెట్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అయితే, రంగస్థలం సినిమాకి శ్రీకాంత్ ఓదెల కాస్ట్యూంస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడట. ఈ నేపథ్యంలో, షూటింగ్ ఆఖరి రోజున రామ్ చరణ్..శ్రీకాంత్ ఓదెలకి ఓ ప్రత్యేకమైన లాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం విశేషం. ప్యారడైజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల చరణ్, చిరులను కలిశారు నాని, శ్రీకాంత్ ఓదెల.
ఆ సమయంలో శ్రీకాంత్ ఈ విషయాన్ని చరణ్‌కి గుర్తు చేశాడు. చిరంజీవి స్వయంగా ఈ లాకెట్‌ను చెన్నైలో తయారు చేయించారట. అప్పుడు, చరణ్ ఇచ్చిన ఈ లాకెట్ ను అప్పటి నుంచి ఇప్పటి వరకూ తీయలేదని చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని రామ్ చరణ్ మర్చిపోవడం షాకింగ్ విషయం. కాగా, నాని నిర్మాతగా మెగాస్టార్ ఒక సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చరణ్‌తోనూ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల.










