సినిమా

Ramya Krishna: మంచు మనోజ్ సినిమాలో రమ్యకృష్ణ..లుక్ అదిరింది

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ramya Krishna: మంచు మనోజ్ ఇటీవల విలన్ గా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సినిమాలో మనోజ్ చేసిన నెగిటివ్ రోల్ కి విశేషమైన స్పందన లభించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త విలన్ వచ్చాడని అందరూ చెప్పుకున్నారు. ఇకపై, కథ డిమాండ్ చేస్తే ఎలాంటి నెగిటివ్ రోల్ అయినా చేయడానికి మనోజ్ రెడీ ఓపెన్‌గానే చెప్పాడు. అలా, అని హీరోగా నో అంటున్నాడా..అంటే అదేమీ లేదు.

మంచు మనోజ్ హీరోగా డేవిడ్ రెడ్డి అని పవర్ ఫుల్ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్..టీజర్ సినిమాపై అంచనాలను బాగానే పెంచేసింది. అయితే, తాజాగా ఈ సినిమలో మరో పవర్ ఫుల్ రోల్ చేస్తోన్న సీనియర్ నటి రమ్య కృష్ణ పాత్ర తాలూకు లుక్‌ని మేకర్స్ తాజాగా రిలీక్ చేశారు. ఈ లుక్ చూస్తుంటే డేవిడ్ రెడ్డి సినిమాలో రమ్య పాత్ర మరో శివగామి అవుతుందంటున్నారు.

దర్శకుడు హనుమా రెడ్డి ఎక్కంటి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తుండగా.. భరత్ మోతుకూరి, నల్లగంగుల వెంకట రెడ్డిలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక, నేడు రమ్య కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో, ఆమె కమలా రెడ్డి అనే పాత్రలో సందడి చేయబోతోంది.

ఏ నటీనటులకైనా ఒక పవర్ ఫుల్ రోల్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాలంటే కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనే భావన ఉంటుంది. కొందరిలో అది జరిగింది కూడా. రమ్య కృష్ణ కూడా అంతే. బాహుబలి సిరీస్ తర్వాత చేసే ప్రతీ సినిమాలోను ఆమె పాత్ర అంతకంటే పవర్ ఫుల్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ, ప్రతీ సినిమాకి అలా కుదరకపోవచ్చు. అందుకే, పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. లైగర్ తర్వాత మళ్ళీ..ఇప్పుడు డేవిడ్ రెడ్డి సినిమాతో మన ముందుకు రాబోతోంది. మరి ఈ పాత్ర ఏమేరకు పేరు తెస్తుందో చూడాలి.

#Ramya Krishna#David Reddy#Manchu Manoj#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి