క్రైమ్

Crime : ఫ్రిడ్జి పేలి నలుగురు సజీవదహనం

రచన: Kumar4 నిమిషాల పఠనం

మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఏ వస్తువు అయినా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

మనం ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఏ వస్తువు అయినా వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఇంట్లో ఫ్రిడ్జి పేలిన ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని చమౌలి గల్లీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే..బెళగావికి చెందిన రాజారాం కుటుంబ సభ్యులు ఇటీవల ఓ కొత్త ఫ్రిడ్జ్ కొనుగోలు చేశారు. దానిని వినియోగిస్తున్న సమయంలో ఇంటర్నల్‌గా ఏదో సమస్య తలెత్తినట్టు సమాచారం.ఆ విషయాన్ని గుర్తించని రాజారాం కుటుంబం.. ఎప్పటిలాగే ఇంట్లో పనులు చేస్తూ వచ్చారు.

సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఫ్రిడ్జి భారీ శబ్దంతో పేలింది. అనంతరం ఇంట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం వ్యాపించడంతో వాటిని ఆర్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పొగ కూడా వ్యాపించడంతో ఊపిరాడక వారంతా ఇంట్లోనే కుప్పకూలినట్టు సమాచారం. దాంతో మంటలు అంటుకుని సజీవదహనం అయినట్టు తెలిసింది.ఈ ఘటనలో శారద డమోలి (50), ఆమె కుమార్తెలు ప్రియా(28), గంగ(25)తో సహా మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.

కాగా, రాజారాం, రోషన్‌లను స్థానికులు ధైర్యం చేసి రక్షించారు.వారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతావారిని కూడా రక్షించేందుకు ప్రయత్నించగా.. దట్టమైన పొగ, మంటలు చెలరేగడంతో వారిని రక్షించలేకపోయినట్టు సమాచారం.ప్రమాదానికి సంబంధించి సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫ్రిడ్జి పేలిన ధాటికి కిచెన్‌తో పాటు ఇల్లు కూడా స్వల్పంగా దెబ్బతినట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2099753795819540887?s=20

#refrigerator#explosion#four dead#karnataka#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి