తెలంగాణ

కామారెడ్డి జిల్లాలో కలకలం.. రూ.15లక్షల విలువైన ప్రభుత్వ మందులు రోడ్డుపాలు

రచన: NK6 నిమిషాల పఠనం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు చేరాల్సిన మందులు రోడ్డు పాలయ్యాయి. గడువు ఉన్న మెడిసిన్‌ను ఓ మినీ డీసీఎం వ్యానులో తరలించి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఈ ఘటన జరిగింది.

Kamareddy: కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు చేరాల్సిన మందులు రోడ్డు పాలయ్యాయి. గడువు ఉన్న మెడిసిన్‌ను ఓ మినీ డీసీఎం వ్యానులో తరలించి రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ప్రభుత్వం సరఫరా చేసే మెడిసిన్స్. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఈ ఘటన జరిగింది.

సుమారు 15 లక్షల విలువైన ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాల్సిన మెడిసిన్స్‌ను ఇలా రోడ్డు పక్కన పారబోయడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అక్కడికి చేరుకున్నారు. డీసీఎంలో ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మెడిసిన్స్ పారబోసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు చేరాల్సిన మందులు

గత కొన్ని రోజులుగా రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో ఇదే తంతు నడుస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు చేరాల్సిన మందులను ఇలా రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఎక్స్‌పైరీ అయిన మందులను రోడ్డు పక్కన పారబోయడం గమనిస్తూనే ఉంటాము. కానీ, ఇక్కడ అందుకు భిన్నమైన ఘటన జరిగింది. ఆ మందులకు ఇంకా గడువు తీరలేదు. ఎక్స్‌పైరీ డేట్ ఇంకా ఉంది. అయినా వాటిని ఇలా పారబోయడం ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు ఈ మెడిసిన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకు ఈ విధంగా పారబోస్తున్నారు? ఇలా చేయమని వారికి ఎవరు చెప్పారు? అనేది అంతు చిక్కడం లేదు. దీనిపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.

రోడ్డు పక్కన మందులు.. భయాందోళనలో ప్రజలు

గత కొంత కాలంగా బిక్కనూరు మండలం బస్వాపూర్, రామేశ్వర్ పల్లి గ్రామ శివారు పరిసరాల్లో పెద్దఎత్తున మెడిసిన్స్ పారబోసి వెళ్లిపోతున్నారు. దీన్ని గమనించిన స్థానికులు షాక్‌కి గురయ్యారు. రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో మందులు చూసి ఆందోళనకు గురయ్యారు. దీనిపై వైద్యాధికారులకు సమాచారం అందించారు. ఇవాళ కూడా డీసీఎం వ్యాన్‌లో మందులు తెచ్చి రోడ్డు పక్కన పారబోస్తుండగా వైద్యాధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

15లక్షల విలువైన మందులు రోడ్డుపాలు

డీసీఎం వ్యాన్‌లో ఒక డ్రైవర్, ఒక మహిళ ఉన్నారు. మెడిసిన్స్ పారబోస్తున్న వారిని వైద్యాధికారులు నిలదీశారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకిలా పారబోస్తున్నారు అని డ్రైవర్‌ని అడిగారు. అయితే, తమకేమీ సంబంధం లేదని వారిద్దరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంకా కాల పరిమితి ఉన్న మందులను ఇలా రోడ్డు పక్కన పారబోయటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీఎం వ్యాన్‌లో ఉన్న మందుల విలువ 15లక్షలు ఉంటుందని వైద్యాధికారులు అంచనా వేశారు.

మందుల కొరత సృష్టించేలా మెడికల్ మాఫియా కుట్ర?

హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకొచ్చి ఇక్కడ పారబోస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉందని సృష్టించేలా ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇదంతా మెడికల్ మాఫియా కుట్ర అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉందని.. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అవి దొరుకుతాయని రోగులను అక్కడికి మళ్లించే ప్లాన్‌లో భాగంగా ఇలా మందులను పారబోసి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. బిక్కనూరు పోలీసులు డీసీఎం వ్యాన్ డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు. వారిని లోతుగా విచారిస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

#Kamareddy#Medicines#Government Hospitals#Bhiknoor#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి