సినిమా

Tollywood: రామ్ చరణ్, సుజీత్ కాంబినేషన్ సినిమా..నిజమేనా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్ గురించి మరోసారి టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. సుజీత్ తెరకెక్కించిన రన్ రాజా రన్, సాహో, దే కాల్ హిమ్ ఓజీ చిత్రాలతో ఆయనకు స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భారీ స్థాయి యాక్షన్, స్టైలిష్ విజువల్స్, ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లపై సుజీత్‌కు ఉన్న ఆసక్తి రామ్ చరణ్ అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది.

Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్ గురించి మరోసారి టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. సుజీత్ తెరకెక్కించిన రన్ రాజా రన్, సాహో, దే కాల్ హిమ్ ఓజీ చిత్రాలతో ఆయనకు స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భారీ స్థాయి యాక్షన్, స్టైలిష్ విజువల్స్, ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లపై సుజీత్‌కు ఉన్న ఆసక్తి రామ్ చరణ్ అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది. దీంతో, చరణ్‌తో సుజీత్ భారీ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఓ లేటెస్ట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

చరణ్ తో సుజీత్ ఎప్పుడో అనుకున్నాడు..

సాహో తర్వాత రామ్ చరణ్‌తో ఒక సినిమా ప్లాన్ చేశానని, ఆ కథను లండన్ నేపథ్యంలో తెరకెక్కించాలనుకున్నామని సుజీత్ చెప్పారు. కోవిడ్ సమయంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో, చాలా గ్యాప్ వచ్చింది. అటు చరణ్, ఇటు సుజీత్ ఎవరి ప్రాజెక్ట్స్ వారు బిజీ అయ్యారు. ఇప్పటి వరకైతే, రామ్ చరణ్–సుజీత్ సినిమా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా కొన్ని మీడియా కథనాలు ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోందని పేర్కొన్నప్పటికీ, సినిమా, కథ, నిర్మాత, ప్రాజెక్ట్ ఓపెనింగ్ వంటి అంశాలపై అధికారిక ప్రకటన రాలేదు.

ఇక, సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ఓజీ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీని, తర్వాత ఓజీ సిక్క్వెల్ ను కూడా ప్రకటించారు. ఇదే సమయంలో సుజీత్.. బ్లడీ రోమియో పనులతో పాటు ఓజీ ఫ్రాంచైజ్ పై కూడా దృష్టి సారిస్తున్నారు. నానితో ఆయన ఇప్పటికే, బ్లడీ రోమియోను అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఓజీ యూనివర్స్‌ను కొనసాగించే ఆలోచనపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కారణంగా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సుజీత్ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతారు. దీని, తర్వాత ఓజీ ఉండబోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక రాజకీయాలలో బిజీ అయితే అప్పుడు చరణ్-సుజీత్ కాంబో పట్టాలెక్కొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

#Ram Charan#Sujeeth#Tollywood#Latest Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి